2024లో మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా ఏదంటే?
కాబట్టి తక్కువ బడ్జెట్‌తో తీసి ఎక్కువ లాభాలు పొందిన 'హనుమాన్' ఈ ఏడాదికి అత్యంత లాభదాయకమైన తెలుగు సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
By: Tupaki Desk | 21 Dec 2024 11:30 PM GMTఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో అనేక సినిమా రిలీజ్ అయ్యాయి. కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను అలరించి, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. వాటిల్లో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించాయి. 'హను-మాన్', 'కల్కి 2898 AD', 'దేవర పార్ట్ 1', 'పుష్ప 2: ది రూల్' వంటి నాలుగు తెలుగు చిత్రాలు 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. 'టిల్లు స్క్వేర్', 'లక్కీ భాస్కర్', 'సరిపోదా శనివారం' లాంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,500 కోట్లకి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. కేవలం హిందీలోనే 645 కోట్ల నెట్ కలెక్షన్స్(16 రోజుల్లో) అందుకొని, వందేళ్ల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. ఇక ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర 1' చిత్రం 520 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ, సినిమా నిర్మాణ వ్యయం ఇతరత్రా విషయాలను లెక్కలోకి తీసుకొని చూస్తే.. 2024లో 'హనుమాన్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ట్రేడ్ అనలిస్ట్ ప్రకారం, 'పుష్ప 2' మేకింగ్ కోసం సుమారు ₹500 - 600 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ₹1600 కోట్లు వసూలు చేసిందని అనుకుంటే 166 - 220% లాభ శాతం వస్తుంది. 'హను-మాన్' విషయానికొస్తే, దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹300 - 350 కోట్లు వసూలు చేసింది. అంటే 650 - 775% లాభ శాతం వస్తుంది. ఈ విధంగా లెక్కించి చూస్తే 'పుష్ప 2' మూవీ కంటే 'హనుమాన్' చిత్రానికి ఎక్కువ ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి తక్కువ బడ్జెట్‌తో తీసి ఎక్కువ లాభాలు పొందిన 'హనుమాన్' ఈ ఏడాదికి అత్యంత లాభదాయకమైన తెలుగు సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
కానీ ఇక్కడ లాభ శాతాన్ని కాకుండా లాభాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తే మాత్రం.. 'పుష్ప 2' ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలుస్తుంది. ఇంకా ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది కాబట్టి, లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ వస్తాయి. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఫైనల్ గా థియేట్రికల్ రెవెన్యూ ఎంత వస్తుందనేది పక్కన పెడితే, నాన్-థియేట్రికల్ రూపంలో నిర్మాతల అకౌంట్ లోకి భారీ మొత్తం వచ్చి చేరింది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ రికార్డ్ స్థాయి ధరలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. పెట్టుబడి, ఇతర ఖర్చులు తీసేసినా ప్రొడ్యూసర్స్ హ్యూజ్ ప్రాఫిట్స్ లో ఉన్నట్లే. సో ఏవిధంగా చూసుకున్నా 2024లో 'పుష్ప 2: ది రూల్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమాగా పేర్కొనవచ్చు.