బాక్సాఫీస్.. కోలీవుడ్ దండయాత్ర మొదలైంది
కంటెంట్ బేస్డ్ గా కథలు చేస్తూ ఉండటం మలయాళీలకి ఎక్కువ విజయాలు వచ్చాయి.
By: Tupaki Desk | 11 July 2024 5:31 PM GMT2024లో మొదటి అర్ధభాగం ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఏ భాషలలో కూడా ఈ ప్రథమార్ధం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు. మలయాళీ ఇండస్ట్రీకి ఈ ప్రథమార్ధంలో ఎక్కువ సక్సెస్ లు వచ్చాయి. ఆవేశం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం లాంటి సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అలాగే చాలా మూవీస్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. కంటెంట్ బేస్డ్ గా కథలు చేస్తూ ఉండటం మలయాళీలకి ఎక్కువ విజయాలు వచ్చాయి.
టాలీవుడ్ కి హనుమాన్, డీజే టిల్లు, కల్కి 2898ఏడీ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ వచ్చాయి. మిగిలిన సినిమాలు ఏవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. తమిళంలో కూడా విజయ్ సేతుపతి మహారాజ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అరణ్మనై 4 కూడా మంచి సక్సెస్ అందుకుంది. హిందీలోలో ఫైటర్, సైతాన్, క్రూ మూవీస్ పర్వాలేదనిపించాయి. అయితే 2024 ద్వితీయార్ధంలో మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.
తెలుగులో అయితే అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు ఈ ఆరు నెలల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఆగష్టు 15న ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో టాలీవుడ్ సినిమాల సందడి మొదలు కాబోతోంది. డిసెంబర్ వరకు వరకు ప్రతి సినిమా పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి కూడా ఈ ద్వితీయార్ధంలో పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.
ఇవన్నీ పాన్ ఇండియా బ్రాండ్ తోనే థియేటర్స్ లోకి రాబోతుండటం విశేషం. జులై 12న ఇండియన్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో స్టార్స్ బాక్సాఫీస్ ఎటాక్ మొదలు కాబోతోంది. తరువాత రజినీకాంత్ వేట్టయాన్, నెక్స్ట్ ఇళయదళపతి విజయ్ GOAT మూవీస్ భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి. అజిత్ కుమార్ విడామయార్చి, విక్రమ్ తంగలాన్ కూడా భారీ అంచనాల మధ్యలో థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
అలాగే ధనుష్ హీరోగా చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రాయన్ మూవీపైన హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్య పాన్ వరల్డ్ మూవీ కంగువ అయితే కోలీవుడ్ కి హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే శివ కార్తికేయన్ అమరన్ మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. కార్తీ వా వాతియార్ సినిమా ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలలో చాలా వరకు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ అంచనాల మధ్యలో రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో ఎన్ని తమిళ్ బాక్సాఫీస్ పై కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తాయనేది వేచి చూడాలి.