భారతదేశంలోనే ఆదరణలో నంబర్-1 వెబ్ ట్రైలర్ ఇదే
రాజ్ అండ్ డీకే రూపొందించిన తాజా వెబ్ సిరీస్ 'గన్స్ & గులాబ్స్' గురించే ఇదంతా. ఈ సిరీస్ ట్రైలర్ ఎవరూ ఊహించని విధంగా అత్యధిక వీక్షణలతో రికార్డ్ సృష్టించింది.
By: Tupaki Desk | 17 Aug 2023 4:34 PM GMTఓటీటీ సిరీస్ లలో సేక్రెడ్ గేమ్స్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కి వీరాభిమానులున్నారు. అయితే సేక్రెడ్ గేమ్స్ ని మించి అనేలా పాపులర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రికార్డ్ వీక్షణలను దక్కించుకుంది. ఈ సిరీస్ రేపటి(18ఆగస్టు) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఇంతకీ అంతటి క్రేజ్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఏది? కర్తలు ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
రాజ్ అండ్ డీకే రూపొందించిన తాజా వెబ్ సిరీస్ 'గన్స్ & గులాబ్స్' గురించే ఇదంతా. ఈ సిరీస్ ట్రైలర్ ఎవరూ ఊహించని విధంగా అత్యధిక వీక్షణలతో రికార్డ్ సృష్టించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ షో ప్రీమియర్‌లకు రెండు రోజుల ముందు ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 76 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇది భారతదేశంలో వెబ్ సిరీస్ ట్రైలర్‌లో అత్యధిక వీక్షణల రికార్డ్ అని అంటున్నారు. నిజానికి భారతదేశంలో ఆదరణ పొందిన పాపులర్ సిరీస్ ల ట్రైలర్లకు ఇందులో సగం ఆదరణ కూడా దక్కలేదు. గన్స్ & గులాబ్స్ ట్రైలర్ ముందుగా యూట్యూబ్ లో 75 మిలియన్ల (7.5కోట్ల) వీక్షణలను సాధించిందని నెట్ ఫ్లిక్స్ ఓ నోట్ లో పేర్కొంది. ఇది ఇప్పటి వరకు ఓటీటీలలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ట్రైలర్‌గా నిలిచిందని చెబుతున్నారు. రాజ్ అండ్ డీకే సిరీస్ పై అభిమానుల ఉత్సాహానికి ఇది నిదర్శనం అని విశ్లేషిస్తున్నారు. సినిమా ట్రైలర్‌లు యూట్యూబ్‌లో మామూలుగా 100 మిలియన్ల వీక్షణలను దాటినప్పటికీ భారతీయ వెబ్ షోలు ఇంకా ఆ మార్కును చేరలేదు. గన్స్ & గులాబ్స్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వీక్షణల మార్కును అధిగమించిన రెండవ వెబ్ సిరీస్ ట్రైలర్‌గా అవతరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
గన్స్ & గులాబ్స్‌కి లభించినన్ని వీక్షణలు ఏ షో ట్రైలర్‌కు దక్కనప్పటికీ మరికొన్ని సిరీస్ లు అత్యుత్తమ నంబర్లను రాబట్టాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 (రాజ్ అండ్ డీకే) ట్రైలర్ 58 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. మహారాణి సీజన్ 2 (49 మిలియన్లు), ఫర్జీ (43 మిలియన్లు), ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 (39 మిలియన్లు), మీర్జాపూర్ సీజన్ 2 (36 మిలియన్లు), రుద్ర (35 మిలియన్లు), ఆర్య సీజన్ 2 (35 మిలియన్లు) అత్యధిక వీక్షణలు సాధించిన వాటిలో ఉన్నాయి. స్కామ్ 1992 (24 మిలియన్లు), ది ఫ్రీలాన్సర్ (23 మిలియన్లు), మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (22 మిలియన్లు) కూడా టాప్ 10 జాబితాలో నిలిచాయి.
గన్స్ & గులాబ్స్ సిరీస్ కొంత క్రైమ్ ఇన్ఫ్యూషన్‌తో కూడిన డార్క్ కామెడీ. ఢిల్లీకి సమీపంలోని ఒక పట్టణంలో 90వ దశకంలో జరిగిన నిజ కథ ఆధారంగా ది ఫ్యామిలీ మ్యాన్ - ఫర్జీ సృష్టికర్తలైన రాజ్ & డికె రూపొందించిన సిరీస్ ఇది. రాజ్‌కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్, ఆదర్శ్ గౌరవ్, TJ భాను, గుల్షన్ దేవయ్య సహా భారీ తారాగణంతో ఇది తెరకెక్కింది. ఈ షో వీక్షకులను 90ల కాలంలోకి తీసుకెళుతుందని ట్రైలర్ చెబుతోంది. గులాబ్‌గంజ్ అనే పట్టణంలో కథ సాగుతుంది. ఈ సిరీస్ ఆగస్టు 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది.