హను మ్యాజిక్ క్లిక్కయితే..
ఇదిలా ఉంటే ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
By: Tupaki Desk | 18 Aug 2024 2:30 PM GMTటాలీవుడ్ దర్శకులలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుంది. గతంలో రాఘవేంద్రరావు సినిమాలలో నటించడానికి హీరోయిన్స్ పోటీ పడేవారు. దానికి కారణం తెరపై హీరోయిన్స్ ని రాఘవేంద్రరావు చాలా గ్లామర్ గా ఆవిష్కరిస్తారనే అభిప్రాయం ఉండటమే. ఇప్పటికి హీరోయిన్స్ ని తెరపై అందంగా ఎలివేట్ చేయడంలో రాఘవేంద్రరావుని ఎవరూ బీట్ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
“అందాల రాక్షసి” సినిమాతో హను రాఘవపూడి టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. సీతారామం వరకు దర్శకుడిగా హను కెరియర్ లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలే వచ్చాయి. అయితే ఆయన కథని చెప్పే విధానం చాలా కొత్తగా డ్రమటిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆయన సినిమాలలో హీరోయిన్స్ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఓ విధంగా కథ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
అలాగే హను రాఘవపూడి సినిమాలలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ని రిపీట్ చేయలేదు. ఎక్కువగా కొత్త వాళ్ళని టాలీవుడ్ కి హీరోయిన్స్ గా పరిచయం చేశాడు. ఆ సినిమాల తర్వాత హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. "అందాల రాక్షసి" సినిమాతో లావణ్య త్రిపాఠిని హను రాఘవపూడి హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని అబ్బాయిల కలల రాణిగా మారిపోయింది.
“కృష్ణగాడి వీరప్రేమకథ” సినిమాతో మెహరీన్ ని హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈమె తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. “లై” సినిమాతో మేఘా ఆకాష్ ని హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ బ్యూటీ కూడా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. సినిమా ఫ్లాప్ అయిన మేఘా ఆకాష్ మాత్రం క్లిక్ అయ్యింది. “పడిపడి లేచే మనసు” సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే సాయి పల్లవికి అది మొదటి సినిమా కాదు.
కానీ ఆమె టాలెంట్ చూసి మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ కోసం సాయి పల్లవినే కరెక్ట్ అని హను రాఘవపూడి ఎంపిక చేశారు. ఇక “సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ని హను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఈ సినిమా మృణాల్ ఠాకూర్ ఇమేజ్ ని ఏ స్థాయిలో పెంచిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం సౌత్, నార్త్ భాషలలో స్టార్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఇమాన్వి ఇస్మాయిల్ ని ప్రభాస్ తో చేయబోయే “ఫౌజీ” సినిమా కోసం హను ఎంపిక చేశాడు. ఆయన ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకుంటే కచ్చితంగా ఇందులో ఇమాన్వికి మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించి ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.