Begin typing your search above and press return to search.

ఓటీటీ కంటెంట్ ఎవరు ఎక్కువ చూస్తున్నారో తెలుసా...!

తాజాగా ఒక సర్వే ప్రకారం ఇండియాలో 823 మిలియన్‌ ల మంది ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్నారు. మొత్తం ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో 86 శాతం మంది ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:04 AM GMT
ఓటీటీ కంటెంట్ ఎవరు ఎక్కువ చూస్తున్నారో తెలుసా...!
X

2020 తర్వాత ఇండియాలో ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కరోనా సమయంలో థియేటర్లు మూత పడటంతో ఒక్కసారిగా ఓటీటీ వినియోగం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటీటీ వినియోగదారుల సంఖ్య గత అయిదు సంవత్సరాల్లో దాదాపుగా 250 శాతం పెరిగినట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది.

తాజాగా ఒక సర్వే ప్రకారం ఇండియాలో 823 మిలియన్‌ ల మంది ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్నారు. మొత్తం ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో 86 శాతం మంది ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. వారు నెలలో కనీసం అయిదు నుంచి పది గంటల పాటు అయినా ఓటీటీ కంటెంట్ చూస్తున్నట్లుగా సర్వేలో వెల్లడి అయింది.

ఇక ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో పట్టణ వాసుల కంటే గ్రామీణ వాసులు ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 53 శాతం మంది అంటే 442 మిలియన్ల మంది ఉన్నారట. 46:54 నిష్పత్తిలో స్త్రీ పురుషులు ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్నారని సర్వేలో తేలిందట.

ఇక ఓటీటీ వినియోగదారుల్లో 57 శాతం మంది ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీ కంటెంట్ చూస్తున్నట్లుగా సర్వేలో తెలిసింది.

రాబోయే ఐదు ఏళ్లలో ఓటీటీ వినియోగం మూడు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని సర్వే ఫలితాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. స్థానిక భాషల్లో మరింత మంచి కంటెంట్ ఇస్తే తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.