Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కిల్ల‌ర్ లుక్‌తో మ‌తులు చెడ‌గొడుతోంది!

హిందీ టెలివిజన్ పరిశ్రమలో పాపుల‌రైన‌ మౌని రాయ్ `నాగిన్`, నాగిన్ సీక్వెల్‌లో అద్భుత న‌ట‌న‌తో అభిమానుల‌కు క‌నెక్ట‌యింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 2:30 PM GMT
ఫోటో స్టోరి: కిల్ల‌ర్ లుక్‌తో మ‌తులు చెడ‌గొడుతోంది!
X

హిందీ టెలివిజన్ పరిశ్రమలో పాపుల‌రైన‌ మౌని రాయ్ `నాగిన్`, నాగిన్ సీక్వెల్‌లో అద్భుత న‌ట‌న‌తో అభిమానుల‌కు క‌నెక్ట‌యింది. టీవీ ప‌రిశ్ర‌మ‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా పాపుల‌రైంది. అక్ష‌య్ స‌ర‌స‌న గోల్డ్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసింది. అటుపై వ‌రుస‌గా ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టించింది. బ్ర‌హ్మాస్త్ర సినిమాతో మౌని రాయ్ ప్ర‌తిభ ఇటు సౌత్ కి కూడా ప‌రిచ‌య‌మైంది.

ఇక‌ త‌నదైన న‌ట‌న‌, ఫ్యాష‌న్ సెన్స్ తో సినీప్ర‌ముఖుల దృష్టిని విశేషంగా ఆక‌ర్షించింది. ఇక మౌని బోల్డ్ స్టైల్ ఎంపికలతో తన అభిమానులను నిరంతరం ఆశ్చర్యపరుస్తుంది. గత సంవత్సరం మౌని అయాన్ ముఖర్జీ చిత్రం `బ్రహ్మాస్త్ర`లో కనిపించింది. ఇటీవల జుబిన్ నౌటియాల్‌తో కలిసి `డోటరా` అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. మౌని రాయ్ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో కూడా కనిపించింది. చివరిగా ఇమ్రాన్ హష్మీ నటించిన షోటైమ్‌లో కనిపించింది.

మ‌రోవైపు మౌనికి సోష‌ల్ మీడియాల్లో ల‌క్ష‌లాదిగా అభిమానులు ఉన్నారు. త‌న‌దైన‌ అద్భుత రూపం ప్ర‌తిభ‌తో మెస్మ‌రైజ్ చేసే ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. తాజాగా మౌని షేర్ చేసిన ఫోటోషూట్ మ‌రోసారి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. డూడూడూ అంటూ రైమింగ్ చేస్తున్న ఈ బ్యూటీ త‌న డ్యాన్స్ ప్ర‌ణాళిక గురించి మాట్లాడింది. ఇక మౌని షేర్ చేసిన ఫోటోషూట్ లో పొట్టి మిడ్డీపై సూట్ ధ‌రించి మ‌తులు చెడ‌గొట్టింది. ఇది అరుదైన క‌ల‌యిక‌. మిడీపై బ్లేజ‌ర్ తో నిజంగా మౌని స్ట‌న్న‌ర్ గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. మౌని కిల్ల‌ర్ లుక్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అంటూ ఈ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో మౌని మాట్లాడుతూ.. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, బ్రహ్మాస్త్ర వంటి ప్రాజెక్టులు త‌న న‌ట‌న‌పై ప్రజల అభిప్రాయాన్ని మార్చాయని వ్యాఖ్యానించింది. కెరీర్ లో వైవిధ్య‌మైన పాత్ర‌లు త‌న‌వైపు వ‌స్తున్నాయ‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. త‌న‌లోని బోల్డ్ కోణాన్ని ఆవిష్క‌రించే ఛాన్స్ కూడా ఉంద‌ని తెలిపింది. మునుముందు తెర‌పై మంట‌లు పెట్టేందుకు ఈ భామ వెన‌కాడ‌న‌ని ప్రామిస్ చేసింది. అయితే కేజీఎఫ్ లో ఐట‌మ్ నంబ‌ర్ చేసిన మౌని మ‌రోసారి సౌత్ లో అగ్గి రాజేసేందుకు దిగుతుందేమో చూడాలి.