రెడ్ ఫ్రాకులో అందాల మౌనిరాయ్
దిశా పటానీ - మౌని రాయ్ B-టౌన్‌లో అత్యంత ఆకర్షణీయమైన బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు విడివిడిగా కనిపించడం లేదు
By: Tupaki Desk | 5 Jan 2024 5:43 AM GMTదిశా పటానీ - మౌని రాయ్ B-టౌన్‌లో అత్యంత ఆకర్షణీయమైన బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు విడివిడిగా కనిపించడం లేదు. ఇటీవల మౌని కొత్త రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో దిశా సందడి చేసింది. ఈ ఇద్దరూ ఆకర్షణీయంగా కనిపించారు. బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలతో పాపులరైన ఈ జంట తమ ప్రత్యేక శైలితో షో స్టాపర్ గా నిలిచారు. ఇంతలోనే కొత్త సంవత్సర వేడుకల కోసం దుబాయ్ కి వెళ్లిన ఈ జోడీ అక్కడ ఆకాశహర్మ్యాల నుంచి ఫోటోషూట్లను షేర్ చేస్తున్నారు. ఇవి వేగంగా వైరల్ అయిపోతున్నాయి.
ఆ ఇద్దరూ గ్లామర్ ఎలివేషన్ పరంగా ఒకరితో ఒకరు పోటీపడడం చూస్తున్నదే. తాజాగా మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోషేట్లలో తన రెడ్ ఫ్రాక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మౌని చాలా సింపుల్ గా కనిపిస్తున్నా రెడ్ ఫ్రాక్ లో ఎంతో హాట్ నెస్ ఎలివేట్ అవుతోంది. రేబాన్ ధరించి రెబలియన్ యాటిట్యూడ్ తో ఆకర్షిస్తోంది. మరోవైపు దిశా పటానీ ఈ ట్రిప్ లో అద్భుతమైన డిజైనర్ లుక్స్ తో ఆకర్షించింది. ఆ ఇద్దరూ కలిసి ఉన్న బ్లాక్ లుక్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
మౌని-దిశా ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ. మౌని రాయ్ చివరిసారిగా వెబ్ సిరీస్ 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ'లో కనిపించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో మౌని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ .. బ్రహ్మాస్త్ర వంటి ప్రాజెక్టులు తనలోని నటి విషయమై ప్రజల అభిప్రాయాన్ని మార్చాయని అంది. 'బ్రహ్మాస్త్ర' పూర్తిగా భిన్నమైనది. గోల్డ్, రా .. మేడ్ ఇన్ చైనా లోను విలక్షణ పాత్రలకు మంచి గుర్తింపు దక్కిందని మౌని తెలిపింది. మరోవైపు దిశా పటానీ తదుపరి ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కల్కి లో కనిపించనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.