Begin typing your search above and press return to search.

రెడ్‌ డ్రెస్‌లో అందమైన విలన్

బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్‌ గా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు లేడీ విలన్ గా బాగా సెట్‌ అవుతుంది అంటూ ప్రశంసలు సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:00 AM GMT
రెడ్‌ డ్రెస్‌లో అందమైన విలన్
X

హిందీ బుల్లి తెర ప్రేక్షకులకు పలు షో ల ద్వారా సుపరిచితురాలు అయిన మౌని రాయ్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది. 2006 లో ఏక్తా కపూర్ డ్రామా క్యూంకి సాస్‌ భీ కభీ బహు థీ తో ఎంట్రీ ఇచ్చింది. పలు డాన్స్ షో లతో పాటు రియాల్టీ షో ల్లో కూడా మౌని రాయ్ సందడి చేసింది. సౌత్‌ ప్రేక్షకులకు బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా మౌని రాయ్ చేరువ అయ్యింది. బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్‌ గా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు లేడీ విలన్ గా బాగా సెట్‌ అవుతుంది అంటూ ప్రశంసలు సొంతం చేసుకుంది.


నాగిన్ సీరియల్‌ తో దేశ వ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన మౌని రాయ్ ఐఫా అవార్డ్‌ తో పాటు రెండు ఐటీఏ అవార్డులను మరియు రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులకు నామినేషన్‌ లను దక్కించుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే బ్లాక్‌ అవుట్‌, వేద మరో సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె వజిన్ట్రీ అనే విభిన్నమైన సినిమాలో నటిస్తోంది. ఆ మధ్య ఈమెకు ఒక తెలుగు ఆఫర్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. హిందీ ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాను కాదన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయమై మౌనీ రాయ్ స్పందించలేదు.


నటిగా మౌని రాయ్ ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఫోటోలకు కొదవ ఉండదు. చాలా మంది హీరోయిన్స్‌ మాదిరిగా కాకుండా మౌని రాయ్‌ చాలా స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. తాజాగా మరో అందమైన ఫోటో షూట్‌ తో మౌని రాయ్ సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. ఈసారి రెడ్‌ డ్రెస్ లో మౌని రాయ్ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఫోటోలకు లైక్‌ కొడుతూ షేర్‌ లు కొడుతున్నారు.

ఒకానొక సమయంలో అత్యధిక పారితోషికం అందుకున్న టీవీ స్టార్‌ గా మౌని రాయ్ నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్‌ లో నాగిన్‌ సీరియల్‌ ను ఆమెకు గేమ్‌ ఛేంజర్ గా అభివర్ణించింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నప్పటికీ బ్రహ్మాస్త్ర సినిమా ఆమెకు గేమ్‌ ఛేంజర్‌ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కొన్ని షూటింగ్‌ దశలో ఉంటే.. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. భవిష్యత్తులో మౌని రాయ్ సౌత్‌ లో కూడా నటిస్తుందేమో చూడాలి.