Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : నాగిని జీరో సైజ్‌ అందాల విందు

ఉత్తరాదిన బుల్లి తెర స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌.

By:  Tupaki Desk   |   13 Jun 2024 4:30 PM GMT
పిక్‌ టాక్ : నాగిని జీరో సైజ్‌ అందాల విందు
X

ఉత్తరాదిన బుల్లి తెర స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. ఈ అమ్మడు నటించిన నాగిన్‌ తో పాటు ఎన్నో సీరియల్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈమె హిందీలో నటించిన కొన్ని సీరియల్స్ సౌత్‌ లో కూడా డబ్‌ అయ్యి టెలికాస్ట్‌ అవ్వడం వల్ల ఇక్కడ కూడా గుర్తింపు దక్కించుకుంది.


ముఖ్యంగా ఈ అమ్మడికి బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్ గా చేయడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో నటిగా మంచి గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యేంతగా ఆ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చింది అనేది కొందరు విశ్లేషకుల మాట.

ఈ అమ్మడు సినిమాలు మరియు టీవీ షో లతో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు ఆకట్టుకునే స్కిన్‌ షో మరియు ఔట్‌ ఫిట్‌ అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు బికినీ షో చేసింది.

ఇంతకు ముందే ఈ అమ్మడు చాలా సన్నగా ఉండేది. ఈ మధ్య ఇంకా సన్నగా మారిందా అన్నట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోల్లో నాగిని ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌ జీరో సైజ్ అందాలు చూపిస్తూ కవ్విస్తుంది. ఈ ఫోటోలు నెటిజన్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.

ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న మౌనీ రాయ్ నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల విందు చేయడం కేవలం ఈ అమ్మడికే సాధ్యం అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.