చైనీస్ సినిమాని ప్రెంచ్ లో చూసినట్లుంది మౌనీరాయ్!
మౌనీరాయ్ అలియాస్ నాగిని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. `నాగిని` సీరియల్ తో అమ్మడు తెలుగింట పాపులర్ అయింది. సినిమాల్లో నటిస్తున్నా? తెలుగు లో ఐడెంటిటీని ఎప్పుడో సంపాదించింది.
By: Tupaki Desk | 23 July 2023 12:34 PM GMTమౌనీరాయ్ అలియాస్ నాగిని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. `నాగిని` సీరియల్ తో అమ్మడు తెలుగింట పాపులర్ అయింది. సినిమాల్లో నటిస్తున్నా? తెలుగు లో ఐడెంటిటీని ఎప్పుడో సంపాదించింది. ఆ మధ్య `బ్రహ్మస్త్ర` సినిమాలో ఏకంగా విలన్ పాత్ర పోషించి మరింత పాపులర్ అయింది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట సంచలనమవుతోంది. తొమ్మిది రోజులుగా ఆసుపత్రిలో ఉన్నట్లు ...స్పాట్ నుంచి కొన్ని ఫోటోలో షేర్ చేసింది. దీంతో మౌనీరాయ్ కి ఏమైందంటూ అభిమానుల్లో ఒకటే కంగారు మొదలైంది.
తాజాగా ఆ వివరాలు మౌనీరాయ్ తెలిపింది. `తొమ్మిది రోజుల తర్వాత ఈరోజే ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో బాదని అనుభవించాను. ఇప్పుడు నెమ్మదిగా కొలుకుంటున్నా. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇంతకాలం నన్ను బాగా చూసుకున్న ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు. చికిత్స సమయంలో నా భర్త ఎంతో తోడుగా నిలిచారు. జీవితమంతా అతనికి రుణపడి ఉంటాను` అంది.
ఇంతవరకూ బాగానే ఉంది. అసలు మౌనీరాయ్ ఆసుపత్రిలో ఎందుకు చేరినట్లు? ఆమె ఉన్నట్లుండి ఏ కారణంగా ఆసుపత్రి పాలైంది? అని బుర్ర పీక్కోవడం అభిమానుల వంతైంది. ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇంటికి వచ్చింది. మధ్యలో ఏం జరిగిందో చెప్పదా? అంటూ అభిమానులు కాస్త అసహనానికి గురైనట్లు కనిపిస్తోంది. ఆసుపత్రిలో చేరడానికి ఓ కారణం ఉంటుంది. ఆ కారణం చెప్పడానికి ఏమైంది? చైనీస్ సినిమాని ప్రెంచ్ లో చూసినట్లు ఉంది నీ ఆసుపత్రి స్టోరీ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మరికొంత మంది మౌనీ రాయ్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పాజిటివ్ గానూ స్పందించారు. ఇప్పుడు ఏ విషయమైనా అంతా ఓపెన్. ఏ సెలబ్రిటీ ఎలాంటి విషయాన్ని దాచి పెట్టడం లేదు. అనారోగ్య సమస్యలేవైనా అయితే అంతే ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నారు. మానసిక రుగ్మతలున్నా చెప్పేస్తున్నారు. కానీ మౌనీరాయ్ మాత్రం అసలు మ్యాటర్ దాచేసిందంటున్నారు.