Begin typing your search above and press return to search.

చీర కట్టులో లేడీ విలన్‌ కవ్వింపులు

ఎక్కువగా స్కిన్‌ షో చేస్తూ కన్నుల విందు చేసే మౌనీ రాయ్ ఈసారి చీర కట్టుతో కవ్విస్తోంది. వైట్ కలర్‌ పై ఎల్లో కలర్‌ ఫ్లవర్స్ తో చీర చాలా ఆకర్షణీయంగా ఉంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 1:30 PM GMT
చీర కట్టులో లేడీ విలన్‌ కవ్వింపులు
X

ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదిహేనేళ్ల క్రితం నుంచి అలరిస్తున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. నాగిని గా దేశం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్న మౌనీ రాయ్‌ కి బాలీవుడ్‌ సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. ఈమె చేసిన బ్రహ్మాస్త్ర మూవీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆమె పాత్రకి మంచి పేరు కూడా దక్కిన విషయం తెల్సిందే.


మౌనీ రాయ్ ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఒక సినిమాలో నటిస్తోంది. రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సౌత్‌ లో కూడా ఈ అమ్మడికి మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి వరకు సౌత్‌ సినిమాలకు ఓకే చెప్పడం లేదు. ఇక ఈ అమ్మడు అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది.

ఎక్కువగా స్కిన్‌ షో చేస్తూ కన్నుల విందు చేసే మౌనీ రాయ్ ఈసారి చీర కట్టుతో కవ్విస్తోంది. వైట్ కలర్‌ పై ఎల్లో కలర్‌ ఫ్లవర్స్ తో చీర చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ చీరను క్లీ వేజ్ షో చేస్తూ మౌనీ రాయ్ కట్టుకోవడం చూస్తే మరింత అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ లేడీ విలన్ ను చీర కట్టులో చూస్తూ ఉంటే చూపు తిప్ప లేక పోతున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉన్నారు అంటూ మౌనీ రాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రేంజ్ లో అందాలను చూపిస్తే ముందు ముందు స్టార్‌ హీరోయిన్స్ కి పోటీగా మారడం ఖాయం అనిపిస్తోంది.