మౌని (Vs) దిశా: సెల్ఫిచ్చి భామలు
ఇంతకీ ఎవరీ భామలు? అంటే.. గ్రేట్ ఫ్రెండ్స్ మౌనిరాయ్ - దిశా పటానీ గురించే ఇదంతా.
By: Tupaki Desk | 24 Dec 2023 3:15 AM GMTఎంత గొప్ప స్నేహితులు అయితే మాత్రం మరీ ఇంతగా చెలరేగిపోవాలా? ఒకరినొకరు వదిలి క్షణమైనా ఉండలేని పరిస్థితి ఏమిటో! వీలున్న ప్రతి వేదికపైనా కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. ఫోటోషూట్లతో దుమారం రేపుతున్నారు. ఇంతకీ ఎవరీ భామలు? అంటే.. గ్రేట్ ఫ్రెండ్స్ మౌనిరాయ్ - దిశా పటానీ గురించే ఇదంతా.
ఈ భామలిరువురూ ఏడాది కిందట స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి నిరంతరం కలిసే కనిపిస్తున్నారు. ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా మెలగడమే కాదు.. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని పరిస్థితి. తాజాగా మౌనిరాయ్- దిశా పటానీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో ఉన్నప్పటి ఫోటో అంతర్జాలంలో వైరల్ అయింది. ఇదిగో ఇలా హోటల్ రూమ్ లోకి రాగానే మళ్లీ సెల్ఫీలు దిగడం ప్రారంభించారు.
``గర్ల్స్ ట్రిప్‌కి గొప్ప న్యాయం సమకూరేలా చేస్తున్నాం`` అని మైని ట్యాగ్ ని కూడా ఇచ్చారు. అయితే ఆ ఇద్దరినీ ఆట పట్టించేందుకు ఒక అభిమాని తన సందేహాన్ని వ్యక్తం చేసాడు. దిశా- మౌని ఇద్దరు స్వలింగసంపర్కులు (హిజ్రాలు).. అని అతడు కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా పోస్ట్ చేసిన ఇన్ స్టా ఫీడ్ లో బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసారు. ఇందులో ఇద్దరూ బీచ్ లో సెల్ఫీలు దిగుతూ చిల్లింగ్ గా కనిపించారు.