తమిళ సినిమాలకు టాక్ ఓకే.. మరి బుకింగ్స్ ఏవీ?
ఈ వారం టాలీవుడ్ లోకి రెండు తమిళ సినిమాలు రిలీజయ్యాయి. మొత్తం నాలుగు సినిమాలు రిలీజవగా, రెండు తెలుగు, రెండు తమిళ సినిమాలొచ్చాయి.
By: Tupaki Desk | 22 Feb 2025 5:30 AM GMTఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమాలో ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సరైన ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమా రూరల్ ఆడియన్స్ వరకు వెళ్లడం కష్టం. సినిమాలో పని చేసిన నటీనటులు సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది.
ఈ విషయాన్ని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఈ ఇయర్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ సినిమాలు కూడా తమ సినిమాలను నెక్ట్స్ లెవెల్ లో ప్రమోట్ చేసుకుని మంచి హిట్లుగా నిలిచాయి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే, తండేల్ మూవీ రూ.110 కోట్లు వసూలు చేసి చాలా మంచి లాభాల్ని అందుకున్నాయి.
ఈ వారం టాలీవుడ్ లోకి రెండు తమిళ సినిమాలు రిలీజయ్యాయి. మొత్తం నాలుగు సినిమాలు రిలీజవగా, రెండు తెలుగు, రెండు తమిళ సినిమాలొచ్చాయి. అయితే విచిత్రంగా ఆ రెండు తమిళ సినిమాలకు మంచి టాక్ వచ్చింది. అందులో ఒకటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కాగా, రెండోది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా.
ఈ రెండు సినిమాలకూ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వాస్తవానికి సినిమాలో ఉన్న కంటెంట్ కు, బయట వస్తున్న టాక్ కు ఏ మాత్రం పొంతన లేదు. ఈ రెండు సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చాలా డల్ గా ఉన్నాయి. మంచి కలెక్షన్స్ రావాలంటే ఈ ప్రమోషన్స్ ఏ మాత్రం సరిపోవు.
ధనుష్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా అయినప్పటికీ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయలేదు. మరోవైపు లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీకి కూడా తెలుగులో మంచి పబ్లిసిటీ చేయలేదు. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం వల్లే ఈ రెండు సినిమాలకు తెలుగులో బుకింగ్స్ డల్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా విషయాన్ని గ్రహించి చిత్ర మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తే ఆక్యుపెన్సీలు పెరిగే ఛాన్సుంది.