నగరంలో షూటింగుల హడావిడి
ప్రస్తుతం హైదరాబాద్ లోకల్ లో పలు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. మామూలుగా సినిమాలంటే లోకల్ లో మాత్రమే కాకుండా నాన్ లోకల్, విదేశాల్లో కూడా చిత్రీకరణ చేస్తారు.
By: Tupaki Desk | 9 Feb 2025 9:40 AM GMTప్రస్తుతం హైదరాబాద్ లోకల్ లో పలు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. మామూలుగా సినిమాలంటే లోకల్ లో మాత్రమే కాకుండా నాన్ లోకల్, విదేశాల్లో కూడా చిత్రీకరణ చేస్తారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఆల్మోస్ట్ అన్నీ సినిమాలూ హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.
వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతుంది. హీరో పవన్ తో పాటూ కీలక నటీనటులంతా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో నాలుగో మూవీగా తెరకెక్కుతున్న అఖండ2 షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ, ఆది పినిశెట్టిపై రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మారుతి తో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో జరుగుతున్నట్టు సమాచారం.
హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో జరుగుతుంది. ఇందులో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడు. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి- మహేష్ బాబు కలయికలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. దీంతో పాటూ నాని హీరోగా వస్తున్న హిట్3 సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది.
ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమా షూటింగ్ జన్‌వాడలో జరుగుతుంటే, సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది. మొత్తానికి భాగ్య నగరం పలు సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి.