డేట్స్ మార్చినా దెబ్బ తప్పలేదు
గత వారం హాలీడేస్ ప్లస్ వీకెండ్ ఉన్నా కూడా వచ్చిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.
By: Tupaki Desk | 3 Oct 2023 9:30 AM GMTఇప్పుడున్న జనాల మైండ్ సెట్ ను అర్థం చేసుకోలేక చాలామంది దర్శక నిర్మాతలు పండగలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ పై నమ్మకం ఉన్నా లేకున్నా ముందు అసలు సరైన టైంలో సినిమాలను విడుదల చేయడం సేఫ్ అనేలా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు శుక్రవారం అంటేనే ఏదో ఒక సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటూ వెళ్ళేది. కానీ ఇప్పుడు హాలిడేస్ ప్లస్ వీకెండ్స్ ను టార్గెట్ ఎక్కువగా చేస్తున్నారు.
గత వారం హాలీడేస్ ప్లస్ వీకెండ్ ఉన్నా కూడా వచ్చిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. స్కంద చంద్రముఖి పెదకాపు 1.. ఈ మూడు సినిమాలు కూడా గత వారం కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ సలార్ సినిమా వాయిదా పడింది అని ఈ వీకెండ్ ఉపయోగించుకోవాలి అని రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి.
కేవలం వినాయక చవితి ఫెస్టివల్ ను తమిళ డబ్బింగ్ మూవీ మార్క్ ఆంటోనీ మాత్రమే ఉపయోగించుకుంది. కాస్త సినిమా పరవాలేదు అనే టాక్ వల్ల కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే అంత మంచి డేట్స్ మిస్ చేసుకున్న పెదకాపు, చంద్రముఖి 2 మొన్న శుక్రవారం ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సోమవారం కూడా సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు.
ఇక మంగళవారం చాలా వరకు స్క్రీన్స్ తగ్గిపోవచ్చు. కేవలం స్కంద సినిమా మాత్రమే ఈ నాలుగు రోజుల వీకెండ్ ను మంచిగా ఉపయోగించుకుందిమ్ అది కూడా కాస్త డివైడ్ టాక్ కావడంతో మెల్లమెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే మరొక టైం లో వచ్చి ఉంటే భారీ స్థాయిలో నష్టాలు వచ్చి ఉండేవి. ఇక నాలుగు రోజులు వరుసగా హాలిడేస్ ఉండడంతో కొంత ఉపయోగపడింది.
చంద్రముఖి తమిళంలో తప్పితే తెలుగులో అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మొదటి రోజే థియేటర్స్ చాలా ఖాళీగా కనిపించాయి. దీంతో రెండవ రోజు స్క్రీన్ తగ్గుతూ వచ్చాయి. ఇక పెదకాపుతో శ్రీకాంత్ అడ్డాల మరొక డిజాస్టర్ చూశాడు. ఈ సినిమాకు మొదట ధైర్యం చేసి ప్రీమియర్స్ కూడా వేశారు. కానీ ఆ ప్రభావం కూడా బాక్సాఫీస్ పై కనిపించలేదు. ఎక్కువగా నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా భారీ స్థాయిలో నష్టాలను కలిగించే అవకాశం అయితే ఉంది.