Begin typing your search above and press return to search.

ఆత్మల కోసం సినిమా.. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్!

అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటున్న ఈ అనుభవం ఒక శ్మశాన వాటికలో జరుగుతుంది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు?

By:  Tupaki Desk   |   8 July 2024 11:30 AM GMT
ఆత్మల కోసం సినిమా.. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్!
X

చుట్టుపచ్చని ప్రకృతి.. ఆకాశంలో తలుక్కుమంటున్న నక్షత్రాలు.. చల్లగా విస్తున్న గాలి.. ఇలా ఓ ఓపెన్ ప్లేస్ లో మంచి సినిమా పెట్టుకుని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ గా ఇలాంటి ఐడియాస్ డేట్ నైట్స్ కు బెస్ట్ అనుకుంటాము.అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటున్న ఈ అనుభవం ఒక శ్మశాన వాటికలో జరుగుతుంది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు?

వినడానికే విచిత్రంగా ఉన్న ఈ సంఘటన నిజంగా జరిగింది. నమ్మశక్యం కానీ ఈ సంగతి థాయ్‌లాండ్‌లో జరిగింది. అక్కడ శ్మశాన వాటికలో చనిపోయిన వారి కోసం ఇలా సినిమాలు ప్రదర్శించారు. జూన్ 2 నుంచి జూన్ 6 వరకు ఈ సినిమా ప్రదర్శన జరిగింది.ఈ స్పెషల్ ప్రోగ్రాంను సవాంగ్ మెట్టా థమ్మసథాన్ ఫౌండేషన్ నిర్వహించింది.

ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లో ఉన్న శ్మశాన వాటికలో సుమారు 3,000 మందికి పైగా చనిపోయిన వారిని ఖననం చేశారు.వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారు వినోదాన్ని ఆస్వాదించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. స్మశానం లో ఉన్న ఆత్మలను కూడా ఎంటర్టైన్ చేయడం కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సినిమా ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఈవెంట్ కు ఆత్మలతో పాటు ఒక నలుగురు ధైర్యవంతులైన సిబ్బంది కూడా పాల్గొన్నారు. మరొక ఊహించని ట్విస్ట్ ఏమిటంటే చనిపోయిన వారి కోసం సినిమాలతో పాటు మధ్యలో ఆస్వాదించడానికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

అంతేకాదు ఈ సినిమాలు చూడడానికి ఆత్మలు ప్రత్యేకంగా చైనా నుంచి థాయిలాండ్ కు వలస వచ్చాయని.. ఆ తర్వాత తిరిగి వెళ్లడానికి ఇష్టపడడం లేదని కొందరు భావిస్తున్నారు. థాయిలాండ్లో చైనీస్ సమాజంలో చనిపోయిన వారికోసం సినిమా ప్రదర్శనను వేయడం ఒక ఆచారం.

చింగ్ మింగ్ అనే పండుగ తర్వాత ఇది జరుగుతుంది. మొదట్లో ఇలా స్మశాన వాటికలో సినిమాలు చూపించడం భయంగా ఉంది అని చెప్పిన వారు కూడా ఆ తర్వాత సానుకూల అనుభవం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. కొందరు ఇది చాలా భయంకరమైన ఆలోచన అని అంటుంటే మరికొందరు ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని భావిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఇలా ఆత్మల కోసం ప్రత్యేకంగా సినిమాలు వేయడం మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది.