Begin typing your search above and press return to search.

డిసెంబర్ 15.. ఒకేసారి 10 సినిమాలు

ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన యానిమల్, హాయ్ నాన్న వంటి సినిమాలతో సంతృప్తి చెందిన సినీ లవర్స్ మళ్లీ కొత్త సినిమాల కోసం చూస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 10:59 AM GMT
డిసెంబర్ 15.. ఒకేసారి 10 సినిమాలు
X

ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన యానిమల్, హాయ్ నాన్న వంటి సినిమాలతో సంతృప్తి చెందిన సినీ లవర్స్ మళ్లీ కొత్త సినిమాల కోసం చూస్తున్నారు. డిసెంబర్ 22 సలార్ దానికంటే ఒక్కరోజు ముందు షారుక్ ఖాన్ 'డంకీ' వంటి బడా సినిమాలు వస్తున్నాయని తెలిసి కూడా కేవలం వారం రోజుల రన్ కోసం ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వీటిలో హారర్ ఆడియన్స్ దృష్టిలో కొంత బజ్ క్రియేట్ చేసుకున్న 'పిండం' మూవీ ప్రధానంగా నిలిచింది.

ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ 'జోరుగా హుషారుగా' మూవీ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని రిలీజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ పరంగాను మంచి సపోర్ట్ దక్కడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సరిపడా థియేటర్స్ దొరికాయి. ఇది కాకుండా ఆలంబన, తికమక తండ, కలశ, సఖి, శాంతల, లాంగ్ లీవ్, మాయలో వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వీటిలో ఏ ఒక్క సినిమాకి కనీసం బక్ లేకపోయినా మౌత్ టాక్ బావుంటే ఎంతో కొంత ఆకట్టుకుంటాయనే ధైర్యంతో రిలీజ్ కి రెడీ అయ్యాయి. చెప్పుకోదగ్గ కాస్టింగ్ కూడా లేదు కాబట్టి ఈ సినిమాల పబ్లిసిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దాంతో ఆడియన్స్ లో ఈ మూవీస్ రిజిస్టర్ కాలేకపోయాయి. ఇక సలార్ వచ్చాక ఈ సినిమాలన్నీ దుకాణం సర్దుకోవాల్సిందే. అసలు వారం రోజుల పాటు దొరికిన ప్రతి థియేటర్లో 28షోలలో ఎన్ని క్యాన్సిల్ కాకుండా కాపాడుకుంటాయనేది ఛాలెంజ్ గా మారింది.

నంబర్ అయితే పెద్దగానే ఉంది కానీ వీటిలో చాలా సినిమాలు కనీస ఫీడింగ్ కి యూజ్ కావని బయ్యర్స్ ఫీల్ అవుతున్నారు. కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ సరిపడా ఖర్చులైనా టికెట్ల రూపంలో వసూలైతే పర్వాలేదు. కానీ మరీ ఐదు, పది టికెట్లు తెగితేనే సినిమాకి వచ్చిన ఆడియన్స్ ని వెనక్కి పంపడం తప్ప మరేం చేయలేమని థియేటర్ యాజమాన్యం వాపోతున్నారు.

ప్రస్తుతానికి యానిమల్ థియేటర్స్ లో బాగానే రాబడుతోంది. అటు ఏ సెంటర్స్ లో హాయ్ నాన్న కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కి పెద్దగా కలెక్షన్స్ ఏం రావడం లేదు. అయినా కూడా ఈ వీకెండ్ ఇన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తడపడటం చూస్తే ఇంతకంటే విచిత్రం మరొకటి ఉండదేమో.