Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్ ఓటీటీ లో సందడి చేయనున్న మూవీ లిస్ట్ ఇదే..

ఈ వీకెండ్ థియేటర్లో సందడి చేసే సినిమాలతో పాటు మూవీ లవర్స్ కోసం ఓటీటీ లో కూడా సరికొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి

By:  Tupaki Desk   |   23 Sep 2024 9:55 AM GMT
ఈ వీకెండ్ ఓటీటీ లో సందడి చేయనున్న మూవీ లిస్ట్ ఇదే..
X

ఈ వీకెండ్ థియేటర్లో సందడి చేసే సినిమాలతో పాటు మూవీ లవర్స్ కోసం ఓటీటీ లో కూడా సరికొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈవారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ చేస్తూ ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలు హడావిడి చేస్తున్నాయి. పైగా వచ్చేది పండగ సీజన్ కావడంతో సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంది.మరి ఈ వారం ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలేమిటో ఓ లుకేద్దాం పదండి.

సరిపోదా శనివారం:

నాచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ డ్రామా సరిపోదా శనివారం. వారం అంతా తల్లికి ఇచ్చిన మాట కోసం శాంతంగా ఉండడానికి ప్రయత్నించే హీరో.. వీకెండ్ అయిన శనివారం విల్లన్స్ కి ఫుల్లుగా క్లాస్ తీసుకుంటాడు. ఇటువంటి వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇన్‌సైడ్ అవుట్ 2

బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీ ఇన్‌సైడ్ అవుట్ 2 ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కాబోతోంది.

డెమోంటే కాలనీ

మీకు హారర్ త్రిల్లర్ నచ్చే పని అయితే కచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన చిత్రం డెమోంటే కాలనీ. ఈ మూవీ మిమ్మల్ని భయపడుతూ ఎంటర్టైన్ చేయడానికి సెప్టెంబర్ 27 నుంచి జి 5 లో వచ్చేస్తోంది.

లవ్ సితార

జి 5 లో స్ట్రీమింగ్ కాబోతున్న మరొక రొమాంటిక్ డ్రామా లవ్ సితార. శోభిత ధూళిపాల నటించిన ఈ చిత్రం 27 నుంచి జి 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

తాజా ఖబర్ 2

సోషల్ మీడియా సెన్సేషన్ భువన్ బి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ తాజా కవర్ 2 ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి కామెడీ కంటెంట్ ఉన్న ఈ చిత్రం మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.

స్ట్రీ 2

హారర్ తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ కలగలిపిన సెన్సేషనల్ హిందీ మూవీ స్త్రీ 2. ఈ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ టైం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ ఈనెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.