Begin typing your search above and press return to search.

2019.. 2025.. సంక్రాంతికి సేమ్ టు సేమ్!

ఇప్పుడు 2025 సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్న విషయంపై అందరి దృష్టి పడింది..

By:  Tupaki Desk   |   9 Oct 2024 2:30 PM GMT
2019.. 2025.. సంక్రాంతికి సేమ్ టు సేమ్!
X

సంక్రాంతి.. ఈ ఫెస్టివల్ పేరు వింటేనే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి. ఏటా పొంగల్ కు అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ ఉన్నా.. తమ సినిమాను రంగంలోకి దింపేందుకు మేకర్స్ వెనుకాడరు. ఈ ఏడాది సంక్రాంతికి అదే జరిగింది. ఒక్కోసారి స్టార్ హీరోలందరూ పెద్ద పండుగకు వచ్చిన రోజులూ ఉన్నాయి. ఇప్పుడు 2025 సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్న విషయంపై అందరి దృష్టి పడింది..

అయితే వచ్చే సంక్రాంతికి అందరి కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి కర్ఛీప్ వేశారు. బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభరతో జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా మూవీ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వచ్చినా.. అవి నిజం కాదని వశిష్ఠ తెలిపారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడంతో వాయిదా పడనుందని తెలుస్తోంది. రవితేజ.. RT 75 కూడా ఇప్పటికే ప్రకటించినట్లు సంక్రాంతికి రిలీజ్ కాకపోవచ్చని సమాచారం.

ప్రస్తుతం సంక్రాంతికి మూడు చిత్రాలు ఖరారు అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్.. పొంగల్ కు వస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట. మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో రూపొందుతున్న NBK 109.. పెద్ద పండగకే వస్తున్నట్లు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఫిక్స్ అయిపోయిందట.

ఆ రెండు చిత్రాలతో పాటు మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ.. 2024 క్రిస్మస్ కు కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ కారణాల వల్ల మేకర్స్.. సంక్రాంతికి వాయిదా వేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకటేష్, బాలయ్య, రామ్ చరణ్ రాబోతున్నారట. అయితే 2019 సంక్రాంతికి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అప్పుడు కూడా వారు ముగ్గురే.. తమ చిత్రాలతో పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్-2.. 2019 సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అయింది. సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించింది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్.. NTR కథానాయకుడు మూవీ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. చరణ్ వినయ విధేయ రామ.. మిక్స్ డ్ టాక్ దక్కించుకుంది. మరి వెంకటేష్, బాలయ్య, చరణ్.. ఇప్పుడు 2025 సంక్రాంతి బరిలో దిగి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.