Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లివే

థియేటర్స్ లో సినిమాని చూడని వారు ఓటీటీలో వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 5:56 AM GMT
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లివే
X

వారం వారం కావాల్సినంత వినోదం ఓటీటీ ద్వారా డిజిటల్ ఆడియన్స్ కి చేరువ అవుతోంది. భాషలతో సంబంధం లేకుండా కంటెంట్ ని ప్రేక్షకులకి అందించడంలో ఓటీటీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఇంటరెస్టింగ్ కథలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా 2-3 వారాల గ్యాప్ లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాని చూడని వారు ఓటీటీలో వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

థియేటర్స్ లో ఆశించిన ప్రేక్షకాదరణ రాని సినిమాలకి ఓటీటీలో మంచి వ్యూవర్ షిప్ వస్తోంది. అలాగే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఆహా ఓటీటీలో హరోం హర మూవీ జులై 15న రిలీజ్ అయ్యింది. హాట్ స్పాట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జులై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈటీవీ విన్ లో మ్యూజిక్ షాప్ మూర్తి జులై 19న రిలీజ్ కాబోతోంది.

హరోం హర మూవీ జులై 18న రిలీజ్ కాబోతోంది. జీ5లో అంజలి నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ జులై 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో త్రిభువన్ మిశ్రా ఐఏఎస్ వెబ్ సిరీస్ జులై 18న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ సూపర్ హిట్ మూవీ ది గోట్ లైఫ్ మలయాళం, తెలుగు వెర్షన్స్ జులై 19న అందుబాటులోకి వస్తోంది. జియో సినిమాలో కూడా సుధీర్ బాబు హరోం హర తెలుగుతో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా జులై 18 న రిలీజ్ కానుంది. అలాగే మరికొన్ని హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి.

ఆహా:

హరోంహర (తెలుగు సినిమా) – జూలై 15

హాట్ స్పాట్ (తమిళ చిత్రం – తెలుగు డబ్) – జూలై 17

ఈటీవీ విన్

మ్యూజిక్ షాప్ మూర్తి (తెలుగు సినిమా) – జూలై 16

హరోం హర (తెలుగు సినిమా) – జూలై 18

జీ5

బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 19

నెట్‌ఫ్లిక్స్

త్రిభువన్ మిశ్రా CA టాపర్ (హిందీ సిరీస్) – జూలై 18

ది గోట్ లైఫ్ (మలయాళ హిట్ చిత్రం - తెలుగు డబ్) - జూలై 19

జియో సినిమా:

హరోంహర (తెలుగు చిత్రం – హిందీ డబ్) – జూలై 18