ఏపీలో ఈ సినిమాల బిజినెస్ గట్టిగానే..
అయితే రాబోయే సినిమాల బిజినెస్ డీల్స్ మాత్రం చాలా నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాయి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆలోచించి సినిమాలపై పెట్టుబడును పెడుతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 21 Nov 2023 2:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత మీడియంలో సినిమాలతో పాటు బిగ్ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరింత హై రేంజ్ లో సందడి మొదలుపెట్టబోతున్నాయి. అయితే డిసెంబర్ ఒకటి నుంచి అసలైన సినిమా పండుగలను స్టార్ కాబోతోంది. ఆ తర్వాత ప్రతివారం ఏదో ఒక సినిమా మినిమం హైప్ క్రియేట్ చేసే విధంగా రాబోతున్నాయి.
అయితే రాబోయే సినిమాల బిజినెస్ డీల్స్ మాత్రం చాలా నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాయి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆలోచించి సినిమాలపై పెట్టుబడును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక డిసెంబరు 1వ తేదీన రాబోయే ఎనిమాల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించడంతో నైజాం లో రేట్లు గట్టిగానే చెబుతున్నారు.
దీంతో నైజాం బ్రేటు కుదిరెందుకు కాస్త సమయం పడుతుంది. ఇక ఆంధ్ర ఏరియాలో మాత్రమే సీడెడ్ మినహాయించి ఈ సినిమాకు మొత్తంగా 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీన రాబోతున్న హాయ్ నాన్న సినిమాకు కూడా ఆంధ్రా ఏరియాలో మంచి క్రేజీ డీల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ మొత్తంగా ఈ సినిమా 10 నుంచి 12 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇక సంక్రాంతికి రాబోయే వెంకటేష్ సైంధవ్ సినిమాకు కూడా ఆంధ్రలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ దాదాపు ఈ సినిమా కూడా 10 కోట్లకు పైగానే డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ మూడు సినిమాలకు అనుకున్న దాని కంటే ఆంధ్ర ఏరియాలలో మంచిగా బిజినెస్ ఆఫర్లు వచ్చాయి.
ఇక ఇప్పటికే సంక్రాంతిలో దాదాపు అన్ని సినిమాలకు సంబంధించిన ఆంధ్ర థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. కాస్త టికెట్ల రేట్లు పెంచితే డిస్ట్రిబ్యూటర్స్ తొందరగానే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ రాబోతోంది. ఈ సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్లు బెస్ట్ రేట్లతో డీల్స్ క్లోజ్ చేసుకున్నట్లు టాక్.