Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల్ని సీక్వెల్స్ టెన్ష‌న్ పెట్ట‌డం లేదా?

'పుష్ప ది రైజ్' పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో? రెండ‌వ భాగం సెట్స్ పైకి తీసుకెళ్ల డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Dec 2023 1:30 AM GMT
నిర్మాత‌ల్ని సీక్వెల్స్ టెన్ష‌న్ పెట్ట‌డం లేదా?
X

టాలీవుడ్ లో హిట్ సినిమాకి సీక్వెల్ అన్న‌ది ట్రెండింగ్ గా మారిపోతుంది. అందుకే తెలివిగా మేక‌ర్స్ మా సినిమా రెండు భాగాలు తెర‌కెక్కుతుందంటూ ముందే హింట్ ఇచ్చేస్తున్నారు. మొద‌టి భాగం హిట్ అయితే కంటున్యూటీ రెండ‌వ భాగం ఉంటుంది. దానికి సీక్వెల్ గా పేరు పెట్టి తీయోచ్చు. ప్లాప్ అయితే ఆపేయో చ్చు. అంత‌కు మించి పోయేదేముంది? అన్న ధోర‌ణి ఇప్పుడు అల‌వ‌రుతుంది. ఇలా రెండు భాగాల‌కు స్పూర్తినిచ్చింది మాత్రం 'బాహుబ‌లి'..'కేజీఎఫ్' లాంటి చిత్రాల‌నే చెప్పాలి.

ఆ రెండు ప్రాంచైజీలు పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యాలు అందుకోవ‌డంతో పెట్టుబ‌డి పెట్టే నిర్మాత ల్లోనూ ధీమా క‌నిపిస్తోంది. న‌మ్మిన కాంబినేష‌న్స్..స్టోరీపై ఎంతైనా ఖ‌ర్చు చేయోచ్చ‌ని క‌ళ్లు మూసుకుని పెట్టుబ‌డి పెడుతున్నారు. అవ‌స‌రం మేర నిర్మాణ రంగంలోకి కార్పోరేట్ సంస్థ‌లు భాగ‌స్వాములుగా మారుతున్నాయి. అందుకోసం మేక‌ర్స్ కి కావాల్సినంత స‌మ‌యాన్ని..వెసులు బాటుని నిర్మాణ సంస్థ‌లు క‌ల్పిస్తున్నాయి.

'పుష్ప ది రైజ్' పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో? రెండ‌వ భాగం సెట్స్ పైకి తీసుకెళ్ల డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టిందో తెలిసిందే. అంతా ప‌క్కాగా కుదిరిన త‌ర్వాతే సుకుమార్ అండ్ కో ఆన్ సెట్స్ కి వెళ్లింది. అలాగే 'కార్తికేయ‌-2' పాన్ ఇండియాలో ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. దీంతో అంత‌ర్జాతీయ స్థాయిలోనే చందు మొండేటి 'కార్తికేయ‌-3'ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

చందు మొండేటిని న‌మ్మి ఎన్ని కోట్లు అయినా పెట్టొచ్చు అన్న ధీమా కుదిరిన త‌ర్వాతనే నిర్మాత‌లు ముందుకొచ్చారు. ఇప్పుడ‌త‌నికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. తాను అనుకున్న విధంగా స్టోరీని సిద్దం చేసుకుని రెడీ అవ్వ‌డ‌మే ఆల‌స్యం. వంద‌ల కోట్లు పెట్టే నిర్మాత‌లు క్యూలో ఉన్నారు. ఇక 'కాంత‌ర' విజ‌యంతో రిష‌బ్ శెట్టి త‌న‌ని తానే పాన్ ఇండియాస్టార్ గా లాంచ్ చేసుకున్నాడు. దీంతో 'కాంతార‌-2'ని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నాడో తెలిసిందే.

మొద‌టి భాగాన్ని కేవ‌లం 17 కోట్ల‌తోనే నిర్మించారు. ఇప్పుడు రెండ‌వ భాగం కోసం హొంబ‌లే సంస్థ వంద‌ల కోట్లు కేటాయించింది. కావాల్సినంత స‌మ‌యాన్ని ద‌ర్శ‌కుడికి ఇచ్చింది. అలాగే 'దేవ‌ర‌-2' ని కొర‌టాల శివ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగం రిలీజ్ కాకుండానే ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసారు. ఒక భాగంలో చెప్ప‌లేని క‌థ కావ‌డంతో రెండు భాగాలుగా డివైడ్ చేసి 'దేవ‌ర‌'ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. సీక్వెల్స్ స్టోరీలు ఆల‌స్య‌మైన హిట్ ఇవ్వాలి అన్న కాన్పిడెన్స్ తో మేక‌ర్స్ అంతే శ్రమిస్తున్నారు. వాళ్ల‌పై నిర్మాత‌లు అంత‌కు మించిన న‌మ్మ‌కాన్ని ఉంచుతున్నారు.