Begin typing your search above and press return to search.

అదేంటి.. ఈ రెండు సినిమాల షోలే క్యాన్సిలా?

ఎప్పటిలానే.. ఈ వారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. గత వారం రిలీజైన ఊరు పేరు భైరవకోన థియేటర్లలో సందడి చేస్తోంది

By:  Tupaki Desk   |   23 Feb 2024 11:40 AM GMT
అదేంటి.. ఈ రెండు సినిమాల షోలే క్యాన్సిలా?
X

ఎప్పటిలానే.. ఈ వారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. గత వారం రిలీజైన ఊరు పేరు భైరవకోన థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ వీక్ ఐదు స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ కాగా.. రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో సిద్ధార్థ్ రాయ్, సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, భ్రమయుగంతో పాటు మరికొన్ని మూవీలు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని ప్రాంతాల్లో ఒక్కడు మూవీ రీరిలీజ్ అయింది.

అయితే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన మూవీ భ్రమయుగం. నిజానికి ఈ సినిమా గతవారమే మాలీవుడ్ లో రిలీజైంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మమ్ముట్టి నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.37 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.17 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నాయి.

తాజాగా తెలుగులో ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఏదైనా కొత్త ప్రయత్నాన్ని టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తుంటరని, అందుకే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది! చాలా చోట్ల ఆడియన్స్ లేక మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయాట. మలయాళంలో మంచి వసూళ్లు సాధించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఇలా జరగడం గమనార్హం.

మరోవైపు, టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా కూడా ఈరోజే విడుదల అయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు తిరుపతి రావు ఇండ్ల తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మార్నింగ్ షోలు కూడా అనేక చోట్ల క్యాన్సిల్ అయ్యాయట. మూవీపై బజ్ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా స్టోరీ అంతా ఓకే అయినా.. టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఇంకాస్త బాగా పనిచేయాల్సిందని రివ్యూలు వస్తున్నాయి. డైరెక్టర్ తన బెస్ట్ ఇచ్చారని, వంద శాతం న్యాయం చేశారని అంటున్నారు. మెయిన్ లీడ్ రోల్ చేసిన అభినవ్‌ గోమఠం తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నట్లు చెబుతున్నారు. హీరోయిన్ వైశాలి రాజ్ బాగా నటించిందని అంటున్నారు.