అక్టోబర్ 6.. ఏ సినిమా క్లిక్కయ్యేనో..
ఈ వారం స్కంద, చంద్రముఖి 2, పెదకాపు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Oct 2023 3:36 PM GMTఈ వారం స్కంద, చంద్రముఖి 2, పెదకాపు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. మూడు డిఫరెంట్ జోనర్ లో వచ్చిన కూడా థియేటర్స్ లో ఆశించిన స్పందన రావడం లేదు. సెప్టెంబర్ చివరి వారం టాలీవుడ్ కి డిజాస్టర్ సినిమాలతో ముగింపు పలికింది. ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీలో ఉండటం విశేషం.
అక్టోబర్ 6న మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో పాన్ ఇండియన్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోన్న మూవీగా 800 మూవీ ఉంది. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.
ఈ వారం సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ అనే మూవీ వస్తోంది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనిని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మామా మాశ్చింద్రా మూవీ కూడా ఈ వారం థియేటర్స్ లోకి రాబోతోంది. చిత్రంలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ లో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అటెన్షన్ పెంచుతుంది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన రూల్స్ రంజన్ మూవీ కూడా ఈ వారంలో రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాదిలో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. మీటర్ మూవీ డిజాస్టర్అయ్యింది. రూల్స్ రంజన్ చిత్రంపైన ఇప్పుడు చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
చిన్న సినిమాలు అయిన కూడా సోషల్ మీడియాలో మాత్రం ఇవి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నాలుగు చిత్రాలు సెప్టెంబర్ 6న థియేటర్స్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. మరి వీటిలో ఏ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ బొమ్మగా నిలుస్తుందనేది తెలియాలి.