గ్లోబల్ మాస్ ప్లస్ ఐకాన్.. జాతకాలు మార్చే సినిమాలు!
కొందరు దాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అవుతుంటారు.
By: Tupaki Desk | 25 March 2024 1:30 AM GMTసినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి సుడి ఎలా తిరుగుతుందో చెప్పలేం. ఒక్క సినిమాతో చాలా మంది హీరోలు లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు. వరుస హిట్లు కొట్టి స్టార్ డమ్ తెచ్చుకుంటారు. అశేషమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. కొందరు దాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అవుతుంటారు. ఏ చిత్ర పరిశ్రమలో ఇది కామనే అని చెప్పవచ్చు.
ఇటీవల టాలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోలు.. తమ గత చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశారు. తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అప్పుడు ఉన్న ట్యాగ్స్ పక్కన పెట్టి కొత్త ట్యాగ్స్ తో సందడి చేస్తున్నారు. వారెవరో కాదు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.
పుష్ప మూవీతో నార్త్ టు సౌత్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకుని తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు పుష్ప-2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే పుష్ప ముందు వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు. డైరెక్టర్ సుకుమార్ ఈ ట్యాగ్ ఇచ్చారు.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. భారీ హిట్ ను అందుకున్నారు. హిట్ కొట్టడంతోపాటు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. విదేశాల్లో ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కొత్త చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత వీరి ట్యాగ్స్ మారిపోయాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ ట్యాగ్ వచ్చింది. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పోస్టర్స్ లో తారక్ పేరు ముందు మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అని కొరటాల శివ వేసిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ కు ఉన్న మెగా పవర్ స్టార్ ట్యాగ్ ను తీసి పక్కన పెట్టి.. గ్లోబల్ స్టార్ అని వేశారు బుచ్చిబాబు..ఇటీవల జరిగిన ఆర్సీ 16 పూజా ఈవెంట్ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని వచ్చింది. మొత్తానికి ఈ ముగ్గురి ట్యాగ్స్ అఫీషియల్ గా మారిపోయాయన్నమాట.
అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న తర్వాతే వారి ట్యాగ్స్ మారడం గమనార్హం. ఇప్పటి వరకు వాళ్ల ఫ్యాన్స్.. పాత ట్యాగ్స్ తో పిలుచుకునేవారు. ఇప్పుడు కొత్త ట్యాగ్స్ తో పిలుచుకుంటున్నారు. పైగా కొత్త బిరుదులు.. గ్లోబల్ లెవల్ లో అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. మరి ఫ్యూచర్ లో నయా ట్యాగ్స్ బన్నీ, తారక్, చరణ్ కు ఎలా కలిసివస్తాయో వేచి చూడాలి.