Begin typing your search above and press return to search.

వరుస డిజాస్టర్స్.. ఇది కూడా ఒక రీజన్?

దీంతో ఆయా మూవీస్ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మారుతున్నాయి. ఎంతో అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి వెళ్లి చూడటం లేదు

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:09 AM GMT
వరుస డిజాస్టర్స్.. ఇది కూడా ఒక రీజన్?
X

సినిమా టికెట్ ధరల్ని నియంత్రిస్తూ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొచ్చాయి. సామాన్యుడిపై భారం అయిపోతుందని భావించి ఏపీలో అయితే చాలా వరకు ధరలని కంట్రోల్ చేశారు. అయితే టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతోన్న సినిమాలో సినిమా బడ్జెట్ ఎంత అయ్యిందనేది లెక్కలు చెబితే వాటికి వారం రోజుల పాటు ధరలు పెంచుకునే సౌలభ్యం కూడా కల్పించారు.

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తరువాత భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో జీవోని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ కోసమే ఏపీ సర్కార్ ఇలా చేసిందని అనేవారు ఉన్నారు.

అయితే గవర్నమెంట్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని థియేటర్స్ లో మూవీ భారం కాకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన చిన్న సినిమాలకి కూడా ఏపీలో డిస్టిబ్యూటర్స్ ధరలు యధావిధిగా పెంచుకొని టికెట్లు అమ్ముకున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టలేదు. భోళా శంకర్ సినిమాకి టికెట్ ధరలు పెంచాలని రిక్వెస్ట్ చేసిన ఏవో కారణాలు చూపించి ఛాన్స్ ఇవ్వలేదు.

కానీ తరువాత రిలీజ్ అయిన సినిమాలకి ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేకుండా టికెట్ ధరలు పెంచుకున్నారు. పెంచిన ధరలతోనే ఆన్లైన్ మూవీ టికెట్ పోర్టల్స్ కూడా పెట్టారు. ఈ ధరలు కూడా సినిమాల ఫెయిల్యూర్ కి ఒక కారణం అవుతున్నాయనే మాట వినిపిస్తోంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వలన ఏవరేజ్ టాక్ వచ్చిన ఆ సినిమాలు థియేటర్స్ లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.

దీంతో ఆయా మూవీస్ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మారుతున్నాయి. ఎంతో అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి వెళ్లి చూడటం లేదు. ఈ ఎఫెక్ట్ ప్రత్యకంగా, పరోక్షంగా నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ మీద పడుతున్న మరి ఎందుకనో ధరల విషయంలో మాత్రం వారికి నచ్చినట్లుగానే వసూలు చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.