నయనతార కార్పోరేషన్ కాదు కంపెనీ...!
అయితే ఎల్‌ఐసీ టైటిల్ వివాదాస్పదం అవ్వడంతో తాజాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 25 July 2024 7:44 AM GMTప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు 'లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్' ఎల్‌ఐసీ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఎల్‌ఐసీ టైటిల్ వివాదాస్పదం అవ్వడంతో తాజాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విడుదల సమయంలో వివాదాలు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ను కాస్త లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్‌ఐకే గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు, అందుకు సంబంధించిన లోగో ను కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో వీరి బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇమేజ్ కి తగ్గ కథను తీసుకుని ఈ సినిమా ను దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రూపొందుతున్నాయి.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను నయనతార తో కలిసి లలిత్ కుమార్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ ఉండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. విడుదల తేదీ విషయంలో అతి త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.