ఏపీలోనూ సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్!
ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సినిమాల టైటిల్స్ రిజిస్ట్రేషన్ ఏపీలోనూ చేసుకోవచ్చు అని రాష్ట్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ వ్యవస్థాపకుడు..సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు.
By: Tupaki Desk | 4 Feb 2024 6:05 AM GMTసినిమా టైటిల్స్ రిజిస్టేషన్ అంటే ఫిలిం ఛాంబర్ గుర్తొస్తుంది. తెలుగు సినిమాలకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రోసస్ అంతా హైదరాబాద్ లోని ఛాంబర్ లోనే రిజీస్టర్ అవుతుంటాయి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉండటంతో సినిమాకి సంబంధించిన కార్యకలా పాలన్నీ అక్కడ నుంచే జరుగుతోన్న నేపథ్యంలో ఈ విధానం అమలులో ఉంది.
అయితే ఏపీలోని విశాఖపట్టణంని ఫిల్మ్ హబ్ గా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియో..ఎఫ్ ఎన్ సీసీ లాంటివి నెలకొనడంతో ఇక్కడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సంఘాలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సినిమాల టైటిల్స్ రిజిస్ట్రేషన్ ఏపీలోనూ చేసుకోవచ్చు అని రాష్ట్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ వ్యవస్థాపకుడు..సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు.
సెన్సార్ ఆమోదం ఉన్న ఎలాంటి ఫిల్మ్ ఛాంబర్ లోనైనా సినిమా టైటిల్స్ రిజిస్టర్ అయితే..అది మరోకరకి ఇచ్చేందుకు వీలుండద్నారు. టైటిల్స్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి తమకు సెన్సార్ కార్యాలయం అనుమ తిచ్చిందని తెలిపారు. దీంతో ఏపీ నుంచి సినిమాలు నిర్మించాలనుకునే వారు ప్రత్యేకంగా హైదరాబాద్ ఛాంబర్ కి వెళ్లి టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదు. ఏపీలోనే ఆ పనులు పూర్తి చేసుకునేలా ఓ వెసులుబాటు దొరికినట్లు అయింది.
అయితే ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ప్రభుత్వం తరుపున ఉత్తర్వులు ఎలా ఉన్నాయి? అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సినిమా అనగానే రకరకాల అసోసియేషన్స్ ఏర్పడుతుంటాయి. ఏదైనా వివాదం తలెత్తితే అవి సినిమా చట్టపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి.