'పేరు' మరోమారు మారుమ్రోగుతోందే!
టైటిల్ రిపీట్ అవ్వడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే
By: Tupaki Desk | 27 July 2023 2:30 AM GMTటైటిల్ రిపీట్ అవ్వడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే. 80లకు ముందొచ్చిన 'దేవదాసు'.. 'మిస్సమ్మ'.. 'మల్లీశ్వరీ'.. 'మాయాబజార్'.. 'మహర్షి'.. 'శ్రీమంతుడు' లాంటి టైటిళ్ల నుంచి ఆ తర్వాత రిలీజ్ అయిన 'శంకరాభర ణం'.. 'స్వాతిముత్యం'.. 'గీతాంజలి'... 'తొలిప్రేమ'.. 'గ్యాంగ్ లీడర్' వరకూ ఎన్నో విజయవంతమైన చిత్రాల పేర్లను ఈ తరం హీరోలు పునరావృతం చేసారు.
వీటిలో చాలా సినిమాలు విజయం సాధించి ఆ టైటిళ్ల గొప్పతనాన్ని మరోసారి చాటా చెప్పాయి. ఇదే తరహాలో తాజాగా కొన్ని సినిమాలకు మళ్లీ పాత టైటిల్స్ రిపీట్ అవుతున్నాయి. విప్లవ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆర్ నారాయణమూర్తి 'లాల్ సలామ్' టైటిల్ తో చాలా కాలం క్రితం ఓ సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడీ టైటిల్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అలాగే నాలుగేళ్ల క్రితం రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ 'కల్కీ' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే టైటిల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ -కె' ..'కల్కీ 2898' గా మార్చారు. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్..భూమిక జంటగా నటించిన 'ఖుషీ' సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీ. సరిగ్గా ఇప్పుడిదే టైటిల్ తో విజయ్ దేవరకొండ..సమంత సినిమా చేస్తున్నారు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్..సాయితేజ్ నటిస్తోన్న 'బ్రో' కూడా రిపీటెడ్ టైటిల్ అని చెప్పొచ్చు. ఆ మధ్య ఇదే టైటిల్ తో నవీన్ చంద్ర.. అవికాగోర్ ఓ సినిమా చేసారు. ఆ చిత్రం కోవిడ్ సమయంలో ఓటీటీలో రిలీజ్ అయింది. థియేటర్ రిలీజ్ కాకపోవడం... ఓటీటీలోనూ సక్సెస సాధించకపోవడంతో బ్రో టైటిల్ అప్పుడు వైరల్ అవ్వలేదు. ఏసినిమాకైనా టైటిల్ ముఖ్యమైనది. కొందరు కథని బట్టి టైటిల్ డిసైడ్ చేస్తే.. మరికొంత మంది హీరో ఇమేజ్ఆధరాంగా టైటిల్ నిర్ణయిస్తారు. టైటిల్ తోనే సినిమా జనాల్లోకి బలంగా వెళ్తుంది. అందుకే టైటిల్ విషయంలో మేకర్స్ ఎక్కువగానే సమయాన్ని వెచ్చిస్తుంటారు.