ఇక మల్టీప్లెక్స్ లో మందు కూడా..
మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ ముంబైలో ఇటీవల జియో వరల్డ్ సెంటర్ లో జియో వరల్డ్ ప్లాజాలో 6 స్క్రీన్ల సముదాయాన్ని ప్రారంభించింది.
By: Tupaki Desk | 6 Dec 2023 8:09 AMసినిమా థియేటర్లో జనాలను అట్రాక్ట్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కాలం ఎంతవరకు ఉంటుందో కానీ మల్టీప్లెక్స్ థియేటర్లో మాత్రం ఇప్పుడు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎక్కువగా అయితే మాల్స్ లోనే ఈ మల్టీప్లెక్స్ లు సరికొత్త తరహాలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇక వెండితెరపై బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ చుట్టూ ప్రపంచంలో కూడా జనాల దృష్టిని ఆకర్షించేందుకు గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో అయితే సినిమాలో చూస్తూ మందు కూడా తాగవచ్చు. అనిపిస్తోంది ఇప్పటికే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థ ఆ తరహా ప్రణాళికను మొదలుపెట్టేసిందే. మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ ముంబైలో ఇటీవల జియో వరల్డ్ సెంటర్ లో జియో వరల్డ్ ప్లాజాలో 6 స్క్రీన్ల సముదాయాన్ని ప్రారంభించింది. 790 సీట్ల తో ఖరీదైన ఇంటీరియర్స్ తో లగ్జరీ ఫీల్ ను ఇచ్చేలా రంగం సిద్ధం చేశారు.
దేశంలోనే బెస్ట్ మల్టీప్లెక్స్ గా దీన్ని రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక లేజర్ టెక్నాలజీ కూడిన బెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ కూడా ఉంది. భారత్ లొనే ఫస్ట్ టైమ్ అనిపించే చాలా విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇక మొదటి సారి బార్ అండ్ లాంజ్ ఏర్పాటుగా సిద్ధం చేస్తున్నారు. ఇక సినిమా చూస్తూ కూడా మందు వేయవచ్చు అని తెలుస్తోంది. ఇండియాలో టాప్ మిక్సాలాజిస్ట్ గా క్రేజ్ అందుకున్న శాంతను చందా ప్రత్యేకంగా తయారు చేసే కాక్ టైల్స్ ని ఇక్కడ పుచ్చుకోవచ్చు.
అలాగే ఈ మల్టీప్లెక్స్ లో ఫుడ్ కూడా చాలా హై లెవెల్లో ఉండనుంది. టాప్ సెలబ్రిటీ చెఫ్స్ సారా టాడ్, విక్కీ రత్నాని, యుటాకా సైటో, మయాంక్ తివారి వంటి స్పెషలిస్ట్ ల చేత ఫుడ్ మెనూ ఉండబోతోంది. ప్రత్యేక మెనూ ద్వారా ఎంపిక చేసిన ఆహార పదార్థాలు సర్వ్ చేయనున్నారు. లైవ్ కుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. మనం చూస్తుండగానే మన సూచనల మేరకు ఖచ్చితమైన పద్ధతుల్లో రెడీ చేయడం జరుగుతుంది
ఇక మొదట రణబీర్ కపూర్ యానిమల్ సినిమా షో ద్వారా ఈ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ థియేటర్ కు వెళితే మాత్రం రెండున్నర గంటల సినిమాలు చూసేందుకు కొనే టికెట్ కన్నా నాలుగైదింతలు ఎక్కువగా ఫుడ్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా కొత్తగా మందు కూడా సెట్ చేయడంతో నార్మల్ ఆడియన్స్ రావడం అంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిందే. కేవలం క్యాష్ పార్టీ ప్రీమియర్ ఆడియెన్స్ మాత్రమే ఈ రేట్లు తట్టుకునేల ఉండవచ్చు. మినిమం ఒక్క టికెట్ ధర రెండు వేల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.