మెగాస్టార్ తో మూవీ.. హింట్ ఇచ్చేసిన వంగా
డిసెంబర్ 1వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.913.05 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది
By: Tupaki Desk | 3 Feb 2024 7:03 AM GMTసందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీ రిలీజ్ తర్వాత ఈ పేరు ఓ రేంజ్ లో మార్మోగుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి (2017).. ఆ తర్వాత బాలీవుడ్లో దాని రీమేక్ కబీర్ సింగ్ (2019)తో సందీప్ సంచలనాలు సృష్టించారు. అప్పుడు ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
డిసెంబర్ 1వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.913.05 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్గా ఈ మూవీ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. తెలుగులో జోరు చూపించినా.. తమిళం, మలయాళంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. లేకపోతే.. ఈజీగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి ఉండేది. ఏది ఏమైనా యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనమే రేపింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలోనూ అదరగొడుతోంది.
ఇది పక్కన పెడితే.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో చిరు ఇంటికి సందీప్ రెడ్డి వంగా, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల విష్ చేయడానికి వెళ్లారు. వారు ముగ్గురికి సంబంధించిన ఓ పిక్ ఆ మధ్య ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో ఒక్క సినిమా పడితే ఇక గూస్బంప్సే అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఓ నెటిజన్.. చిరు, సందీప్ పిక్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "దేవుడా దయచేసి ఇది జరిగేలా చేయండి. ఈ కాంబినేషన్ సెట్ చెయ్యి సందీప్ అన్నా" అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కు సందీప్ రెడ్డి వంగా లైక్ కొట్టారు. దీంతో సందీప్ వంగా.. చిరుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.
ఇక సందీప్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చిరుతో సినిమా చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. చిరుతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు. తనకు చిరంజీవి అంటే ఇష్టమని అంతకు ముందు కూడా సందీప్ వెల్లడించారు. దీంతో ఈ క్రేజీ కాంబో మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు అటు సందీప్ ఫ్యాన్స్, ఇటు మెగా అభిమానులు చెబుతున్నారు.