Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ సాంగ్ పై ట్రోలింగ్… హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్

టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   11 July 2024 9:47 AM GMT
మిస్టర్ బచ్చన్ సాంగ్ పై ట్రోలింగ్… హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్
X

టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆగష్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే కొంతమంది మాత్రం పనిగట్టుకొని మూవీలో స్టెప్పులపై ట్రోల్ చేస్తున్నారు.

ఇందులో ప్రత్యేకంగా కొన్ని డాన్స్ మూమెంట్స్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 50 ఏళ్ళ రవితేజ 25 ఏళ్ళ భాగ్యశ్రీ తో డాన్స్ స్టెప్పులు వేసాడు. ఈ సాంగ్ లో కనీసం హీరోయిన్ ముఖాన్ని కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారికి కావాల్సింది ఆమెని అభ్యంతరకరంగా చూపించడమే.. ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీస్ లో ఒకటిగా ఉంది అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.

దీనిపై హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. గొప్ప ఆవిష్కరణ చేసారు. మీరు నోబెల్ బహుమతికి దరఖాస్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలని అభ్యంతరకర వ్యాఖ్యలని మీరు కొనసాగించండి. కచ్చితంగా మిమ్మల్ని స్వాగతిస్తాం అంటూ హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మరికొంత మంది నెటిజన్లు హరీష్ శంకర్ కి సినిమాలోని హీరోయిన్స్ ని వల్గర్ గా చూపించడం అలవాటైపోయిందంటూ అతని పాత సినిమాల క్లిప్ లని షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హరీష్ శంకర్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ చేసే కామెంట్స్ కి కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఏదైనా విషయంపై ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ గా మాట్లాడటం హరీష్ శంకర్ నైజం. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆగిపోయిందని వచ్చిన ఓ కథనంపై హరీష్ శంకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యి కౌంటర్ ఇచ్చారు. అలాగే తన సినిమాల గురించి గాసిప్స్ రాసేవారిపైన కూడా హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ ఉంటారు.

అలాగే మిస్టర్ బచ్చన్ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ పై ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. సాంగ్ బాగుందని అభినందించిన వారికి ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే సాంగ్ లో డాన్స్ మూమెంట్స్ ని ట్రోల్ చేసినవారికి కౌంటర్ ఇచ్చారు. ఈ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్కీ జె మియర్ సంగీతం అందించారు. హరీష్ శంకర్ ని ఇరుకున పెట్టడానికి అతనిని నెగిటివ్ గా పోర్ట్ రైట్ చేయడానికి కావాలని సాంగ్ ని ట్రోల్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్ కూడా సాంగ్ పై నెగిటివ్ ట్రోల్ చేస్తున్న వారిపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.