Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. గెట్ రెడీ!

ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండటంతో మరుసటి రోజు రాఖీపౌర్ణమి ఫెస్టివల్ కూడా కలిసొస్తుంది.

By:  Tupaki Desk   |   21 July 2024 12:00 PM GMT
మిస్టర్ బచ్చన్.. గెట్ రెడీ!
X

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే వెంటనే మిరపకాయ్ మూవీ గుర్తుకొస్తుంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మరల చాలా సార్లు రవితేజ, హరీష్ శంకర్ కలిసి మూవీ చేయాలని ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. ఫైనల్ గా ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్ గా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మరోసారి చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. అలాగే ఆగష్టు 14న మూవీ స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

సినిమాకి మిక్కీ జే మియర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. సినిమాలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్ కీలక పాత్రలలో కనిపించాబోతున్నారంట. ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండటంతో మరుసటి రోజు రాఖీపౌర్ణమి ఫెస్టివల్ కూడా కలిసొస్తుంది. దీంతో 5 రోజుల వీకెండ్ కి మిస్టర్ బచ్చన్ తో కావాల్సినంత వినోదం లభిస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజాగా రిలీజ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో వైట్ కలర్ అవుట్ ఫుట్ తో రవితేజ స్టైలిష్ గా కుర్చీలో కూర్చున్న స్టిల్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రవితేజ ఒకప్పటి ఎనర్జిటిక్ లెవల్ కామెడీని మిస్టర్ బచ్చన్ లో చూడొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాకి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. టిజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న సినిమా కావడంతో ఈ మిస్టర్ బచ్చన్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. వీటిని ఎంత వరకు అందుకుంటారు అనేది వేచి చూడాలి. అలాగే సుమారు ఐదేళ్ల తర్వాత హరీష్ శంకర్ నుంచి మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతుండటం విశేషం.