Begin typing your search above and press return to search.

వాళ్లందరిని పక్కన నెట్టేసేలా ఉందిగా..?

తెలుగులో స్టార్స్ చాలామంది ఉంటారు కానీ వారికి తగినట్టుగా హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 11:30 AM GMT
వాళ్లందరిని పక్కన నెట్టేసేలా ఉందిగా..?
X

తెలుగులో స్టార్స్ చాలామంది ఉంటారు కానీ వారికి తగినట్టుగా హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఐదారు సినిమాలు తీస్తే చాలు హీరోయిన్స్ అంతా మొహం కొట్టేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఐతే కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లాం అన్నట్టు కాకుండా కచ్చితంగా ఒక 10, 15 ఏళ్లు కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగినట్టుగానే సినిమాల ఎంపిక చేసుకుంటారు. హీరోయిన్స్ లో రెండు రకాల వారు ఉంటారు. వచ్చీ రాగానే హిట్టు కొట్టేసి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారు కొందరైతే ప్రేక్షకులకు సినిమా సినిమాకు తమ అభినయాన్ని చూపిస్తూ వారి మనసులు గెలిచుకోవడం వారు కొందరు చేసే పని.


ఐతే ఈ రెండు కేటగిరిల హీరోయిన్స్ కి కూడా ముందు ఫస్ట్ సినిమా మాత్రం సెంటిమెంట్ గా భావిస్తారు. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటే చాలు వాళ్లకు పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటీ వచ్చేస్తుంది. అందుకే ఈమధ్య బాలీవుడ్ భామల సైతం తెలుగు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ మహారాజ్ రవితేజతో తొలి సినిమా ఆఫర్ అందుకుంది భాగ్య శ్రీ బోర్స్.

హరీష్ శంకర్ దృష్టిలో పడింది అంటే కచ్చితంగా ఆ హీరోయిన్ ఫేట్ మారినట్టే లెక్క. అప్పుడు పూజా హెగ్దేకి లైఫ్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు తొలి సినిమాతోనే భాగ్య శ్రీకి సూపర్ క్రేజ్ వచ్చేలా చేశాడు. గురువారం రిలీజ్ అవుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా హీరో రవితేజకు ఈక్వల్ గా హీరోయిన్ భాగ్య శ్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎలా భాగ్య శ్రీని చూసి ఓకే అనుకున్నాడో కానీ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చేస్తున్న హంగామా చూసి సూపర్ సెలక్షన్ అనేస్తున్నారు.

భాగ్య శ్రీ కూడా తెలుగులో స్టార్ అయితే వచ్చే ఛాన్సులు ముందే పసిగట్టేసింది కాబోలు అందుకే సినిమా కోసం మాక్సిమం అంటే మాక్సిమం ఇచ్చేస్తుంది. తప్పకుండా భాగ్య శ్రీ ఊపు చూస్తుంటే ఇప్పుడు ఫాం లో ఉన్న రష్మిక, శ్రీలీల, మృణాల్ లాంటి హీరోయిన్స్ అందరినీ కూడా పక్కన పెట్టేసేలా ఉంది. భాగ్య శ్రీ దూకుడు కూడా బాగానే ఉంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండతో ఛాన్స్ అందుకుంది. మిస్టర్ బచ్చన్ హిట్ పడింది అంటే మాత్రం ఇక అమ్మడికి తిరుగు లేదన్నట్టే లెక్క అని చెప్పొచ్చు.