Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే..

మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మిస్టర్ బచ్చన్" మొదటి రోజు కలెక్షన్లలో బాక్సాఫీస్ వద్ద మంచి హవా చూపించింది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 7:34 AM GMT
మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే..
X

మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మిస్టర్ బచ్చన్" మొదటి రోజు కలెక్షన్లలో బాక్సాఫీస్ వద్ద మంచి హవా చూపించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా మంచి షేర్ రాబట్టడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.56 కోట్ల షేర్‌ను రాబట్టింది. దీనిలో నైజాం ఏరియాలో ఏకంగా 2.10 కోట్లు, సీడెడ్ ఏరియాలో 73 లక్షలు, ఉత్తరాంధ్రలో 50 లక్షలు, గోదావరి జిల్లాల్లో 46 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణా జిల్లాలో 21 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు కలెక్షన్లు రాబట్టింది. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ 6.40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఈ మొత్తం కలెక్షన్లలో 20 లక్షలు ప్రీమియర్ షోలు ద్వారా వచ్చిన వసూళ్లు కూడా కలుపుకోవాలి.

మిగతా రాష్ట్రాల్లో, అంటే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా (ROI) ఎరియాలలో ఈ సినిమా 32 లక్షల షేర్‌ రాబట్టింది. అంతేకాక, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా 38 లక్షల షేర్‌ను రాబట్టి తన హవా చూపింది. దీంతో, వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు ఈ సినిమా 5.26 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ మొత్తం గ్రాస్ కలెక్షన్ 7.80 కోట్లుగా నమోదైంది.

మొదటి రోజు వచ్చిన ఈ కలెక్షన్లు సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, కామెడీ పంచ్‌లతో బాగా కనెక్ట్ అయింది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, రవితేజ నటన, హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద మంచి విజయవంతం చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా 1వ రోజు ప్రపంచవ్యాప్తంగా షేర్ లు (GST సహా)

నైజాం: ₹2.10 కోట్లు~

సీడెడ్: ₹73 లక్షలు

ఉత్తరాంధ్ర: ₹50 లక్షలు

తూర్పు గోదావరి: ₹26 లక్షలు

పశ్చిమ గోదావరి: ₹20 లక్షలు

గుంటూరు: ₹38 లక్షలు

కృష్ణా: ₹21 లక్షలు

నెల్లూరు: ₹18 లక్షలు

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 1వ రోజు టోటల్ షేర్: ₹4.56 కోట్లు (6.40 కోట్లు గ్రాస్)

కర్ణాటక + ROI: ₹32 లక్షలు

ఓవర్సీస్: ₹38 లక్షలు~

ప్రపంచవ్యాప్తంగా: షేర్ ₹5.26 కోట్లు (7.80 కోట్లు గ్రాస్)