Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. ఓ సర్ ప్రైజ్ సాంగ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jun 2024 5:58 AM GMT
మిస్టర్ బచ్చన్.. ఓ సర్ ప్రైజ్ సాంగ్
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నామ్ తో సునా హోగా సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే రవితేజ షాక్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన హరీష్ శంకర్.. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత వారి కాంబోలో వచ్చిన మిరపకాయ్ కూడా మెప్పించింది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో మిస్టర్ బచ్చన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తున్నారు. ఇప్పటికే వీరిని.. ఇటీవల రిలీజ్ చేసిన షో రీల్ లో పరిచయం చేశారు మేకర్స్. గ్లింప్స్ లో రవితేజ సరికొత్త లుక్ లో మాస్ స్వాగ్ తో అదరగొట్టారు.

తాజాగా సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. అదిరిపోయే సాంగ్ ను షూట్ చేసినట్లు ట్వీట్ చేశారు. “నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా.. లెజండరీ సాహితి పాడిన ఈ పాటను షూట్ చేయడం చాలా ఉత్సాహంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. అయితే సాహితి.. హరీష్ శంకర్ గత సినిమాల్లోని కెవ్వు కేక, అస్మైక యోగ పాటలు పాడిన విషయం తెలిసిందే. ఆ రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఆ విషయాన్ని కూడా హరీష్ మెన్షన్ చేశారు.

ఇక ఈ సినిమాలోని దాదాపు అన్ని పాటలు.. కాశ్మీర్ లోని దాల్ లేక్ వద్ద షూట్ చేసినట్లు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. హీరోయిన్ తో మూడు డ్యూయెట్ సాంగ్స్ అక్కడే షూట్ చేశారని తెలుస్తోంది. ఐటెం సాంగ్ మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించినట్లుగా వినికిడి. ఆ పాట కోసమే హరీష్ తాజాగా ట్వీట్ చేశారని టాక్. అయితే హరీష్ శంకర్ సినిమాల్లో ఫారిన్ సాంగ్ ఒక్కటైనా కనిపిస్తుంటుంది. కానీ మిస్టర్ బచ్చన్ లో మాత్రం లేదట.

అయితే ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన షో రీల్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో కూడా తన టాలెంట్ తో ఫిదా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.