Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. ఓ పనైపోయింది

ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా షూటింగ్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి అయింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 2:15 PM GMT
మిస్టర్ బచ్చన్.. ఓ పనైపోయింది
X

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న "మిస్టర్ బచ్చన్" సినిమా షూటింగ్ ఇన్ని రోజులు గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంది. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మాస్ రాజా తో జెట్ స్పీడ్ లో వర్క్ ఫినిష్ చేయవచ్చు అని మరోసారి రుజువయ్యింది. ఇక ఫైనల్ గా సినిమా షూటింగ్. ఈ రోజుతో పూర్తయింది. ఈ సినిమా ఆగస్ట్ 15న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా షూటింగ్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి అయింది. ఆఖరి రోజు చివరి పాట షూట్‌ కూడా పూర్తయింది. 14న ప్రీమియర్స్, 15న గ్రాండ్ రిలీజ్‌కి సూపర్ ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నా. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి, ఆయన అందించిన అపారమైన సపోర్ట్‌కి నేనెప్పటికీ రుణపడి ఉంటా," అని హరీష్ శంకర్ ట్విట్టర్ పేర్కొన్నారు.

అలాగే ఆగస్ట్ 7న సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మిస్టర్ బచ్చన్ సినిమా కమర్షియల్ అంశాలన్నింటిని సమర్థవంతంగా మిళితం చేస్తూ ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌ను అందించబోతోందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. రవితేజ కాంబినేషన్‌లో హరీష్ శంకర్ ఇప్పటికే గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్‌ను అందించిన సంగతి తెలిసిందే. అదే కాంబినేషన్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో మళ్ళీ మాయ చేయబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదలైన రొమాంటిక్ పోస్టర్ సినిమాపై హైప్ పెంచింది. ఇందులో రవితేజ, హీరోయిన్ భగ్యశ్రీ బోర్స్ మధ్య రొమాంటిక్ సీన్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రంతో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా హిందీ మూవీ రెయిడ్ కు అధికారిక రీమేక్ కావడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం మీద రవితేజ ఫ్యాన్స్ తో పాటు, సినిమా ప్రియులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మిస్టర్ బచ్చన్ రవితేజ కెరీర్ లో మరో హిట్ సినిమా అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.