మిస్టర్ ప్రెగ్నెంట్.. గర్భిణీలకు ప్రీమియర్స్.. ఇది రెస్పాన్స్
హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో 200 ప్రెగ్నెంట్ మహిళలతో కలిసి సినిమాను చూసింది. ఈ ప్రీమియర్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది.
By: Tupaki Desk | 17 Aug 2023 3:39 PM GMTబిగ్ బాస్‌తో క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరో సోహెల్. ఆ తర్వాత సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. చివరగా 'అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' సినిమాతో వచ్చిన సొహెల్.. ఈ సారి ప్రయోగాత్మక 'మిస్టర్ ప్రెగ్నెంట్' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు ఎమోషన్ కు గురి చేశాయి. అమ్మ పురిటి కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథతో ఈ సినిమా రానుంది.
అయితే ఈ మధ్య కాలంలో సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంటే రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేస్తు ఆడియెన్స్ ను ఆకర్షించే ట్రెండ్ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ బట్టి కూడా దానికి సంబంధించిన ఆడియెన్స్ కు ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఆ మధ్యలో మహిళలపై తీసిన రైటర్ పద్మభూషణ సినిమా.. స్పెషల్ గా మహిళల కోసమే స్పెషల్ ప్రీమియర్స్ వేసి ఆకట్టుకుంది. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా అలాంటి పనే చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 18 శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా కేవలం గర్భిణుల కోసమే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించింది మూవీటీమ్. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో 200 ప్రెగ్నెంట్ మహిళలతో కలిసి సినిమాను చూసింది. ఈ ప్రీమియర్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన గర్భిణులంతా.. సానుకూలంగా స్పందించారు. అందరూ సినిమాలోని సబ్జెక్ట్‌ను ఆస్వాదించారు.
సినిమా చూసి బయటకు రాగానే ఎమోషన్ అవుతూ.. 'ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైమ్ చాలా బాగుంది', 'ఎవ్వరూ ఇలా ట్రై చేసి ఉండరు', 'చాలా ఎమోషనల్ గా ఉంది', 'ఇలాంటి కథ సెలెక్ట్ చేసుకోవడానికి దమ్ము ఉండాలి', 'చాలా గొప్ప కథ', అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రెస్పాన్స్ మేకర్స్ నమ్మకాన్ని మరింత పెంచింది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న ధీమాను పెంచింది.
ఇక ఈ రెస్పాన్స్ తో సినిమాపై మరింత బజ్ పెరిగింది. సినిమా చూసేందుకు ఆడియెన్స్ మరింత ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలిసింది. చూడాలి మరి ఈ సినిమా థియేటర్లలో కూడా ఇలాంటి రెస్పాన్స్ ను అందుకుంటోందో లేదో.. అలానే సోహెల్ కు మంచి హిట్ ను అందించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందో లేదో.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. సోహెల్‌కు జోడీగా రూప హీరోయిన్ గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా సినిమాను రూపొందించారు. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు.