హీరోయిన్ని వదిలేసి పారిపోయిన ప్రియుడు
పాడ్ కాస్ట్ లో మృణాల్ మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం తనకు చివరిగా బ్రేకప్ అయ్యిందని చెప్పింది.
By: Tupaki Desk | 14 Sep 2024 9:30 PM GMTచెవిపోటు ఎవరినీ ఎలా విడిచిపెట్టదో సినీతారల ప్రేమాయణాలు బ్రేకప్ లు అలాంటివే. ఎవరూ దీనికి అతీతులు కాదు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికీ ఆ అనుభవం ఎదురవుతుంది. ఒక పాడ్‌కాస్ట్‌లో మృణాల్ ఠాకూర్ తన హృదయానికి గాయమైన సందర్భం గురించి అడిగాడు. పాడ్ కాస్ట్ లో మృణాల్ మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం తనకు చివరిగా బ్రేకప్ అయ్యిందని చెప్పింది. కనీసం నడకవడంలో కూడా తడబడ్డానని, అంతగా కలత చెందానని వెల్లడించింది.
సరైన వారితో ఉండటానికి.. మనం తప్పుడు వ్యక్తితో ఉండాలి! అని కూడా పాడ్ కాస్ట్ లో వ్యాఖ్యానించింది. మీకు ఏది పని చేస్తుందో ..ఏది పని చేయదో తెలుసుకోవాలి! అని చెప్పింది. తాను కట్టుబడి ఉన్న వ్యక్తితో తాను అననుకూలంగా ఉన్నానని కనుగొనడం తనకు ఇష్టం లేదని కూడా అంది. తన చివరి భాగస్వాములలో ఒకరు తనతో డేటింగ్ చేయలేక సంబంధాన్ని ముగించారని కూడా చెప్పింది. అతడు చాలా ఆర్థడాక్స్ నేపథ్యానికి చెందినవాడని చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ అధ్యాయం ముగిసినందుకు నేను సంతోషిస్తున్నాను! అని వెల్లడించింది. ఎందుకంటే అతడితో కలిసి పిల్లలను పెంచడం చాలా కష్టం అని అంది. తన లవ్ లైఫ్, భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందడం లేదని కూడా మృణాల్ చెప్పింది.
లుక్స్ లేదా కాబోయే బాయ్‌ఫ్రెండ్ కెరీర్ వంటి మిడిమిడి ప్రమాణాల గురించి తాను ప్రత్యేకంగా ఆందోళన చెందడం లేదని మృణాల్ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ సాంప్రదాయకంగా ఆకర్షణీయంగా ఉండాలని తాను భావించనని తెలిపింది. నేను రూపాన్ని గమనించను. నా మగ స్నేహితులు ఎవరూ గొప్ప అందగాళ్లు కాదు. వారు మంచి వ్యక్తులు అని చెప్పింది. తన బ్రేకప్స్ లో ఏదీ గందరగోళంగా లేదా నాటకీయంగా లేదని కూడా మృణాల్ తెలిపింది. నా రిలేషన్ షిప్స్ ఎటువంటి కఠినమైన భావాలు లేకుండా స్నేహపూర్వక నోట్‌తో ముగిశాయి. విడిపోవాలనే పరస్పర నిర్ణయం వల్ల తన ప్రేమలన్నీ ముగిశాయని మృణాల్ వెల్లడించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మృణాల్ చాలా ఆసక్తికరమైన లైనప్ తో బిజీ నటిగా కొనసాగుతున్నారు. పూజా మేరీ జాన్ , హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 అనే మూడు సినిమాల్లో మృణాల్ తదుపరి కనిపించనుంది.