సక్సెస్ పార్టీని హీటెక్కించిన సమంత-మృణాల్!
తాజాగా సమంత-మృణాల్ ఠాకూర్ ముంబైలో జరిగిన సీటాడెల్ హనీ బెన్నీ సక్సెస్ పార్టీకి హాజరైన తీరు చూపరులను ఆకర్షిస్తుంది.
By: Tupaki Desk | 29 Nov 2024 11:28 AM GMTబాలీవుడ్ కల్చర్ లో ఇమడటం అన్నది అంత వీజీ కాదు. అందులోనూ సౌత్ నుంచి వెళ్లిన భామలు అక్కడ నిలదొ క్కుకోవాలంటే? అక్కడ కల్చర్ ని పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలి. ఇటీవలి కాలంలో అలా సక్సెస్ అయిన నిలదొక్కుకుంది ఎవరు? అంటే రష్మిక మందన్నా..సమంత పేర్లు చెప్పొచ్చు. అప్పటి వరకూ టాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్న భామలు ఒక్కసారిగా బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ దిశగా ఎలా వెళ్తున్నారో కనిపిస్తూనే ఉంది.
వేసే డ్రెస్ నుంచి మాట్లాడే భాష వరకూ ఎన్నో మార్పులు స్పష్టం చూడొచ్చు. ముఖ్యంగా డిజైనర్ దుస్తుల్లో ఈ భామలు ఉత్తరాది భామల్నే మించిపోతున్నారా? అన్న సందేహం అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది. అంతగా ఇద్దరు అక్కడ కనెక్ట్ అయ్యారు. తాజాగా సమంత-మృణాల్ ఠాకూర్ ముంబైలో జరిగిన సీటాడెల్ హనీ బెన్నీ సక్సెస్ పార్టీకి హాజరైన తీరు చూపరులను ఆకర్షిస్తుంది. సమంతకు ఎంతో ఇష్టమైన క్రేషా బజాజ్ డిజైన్ లో తళుకులీనింది.
టాప్ లో గోల్డెన్ బీడ్ వర్క్‌తో ఎంతో అందంగా షైనింగ్ అవుతుంది. బంగారు పూసల పట్టీలు - బహుళ-లేయర్డ్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మ్యాచింగ్ బాటమ్ లో బ్లాక్ కలర్ ప్యాంట్ ని ఎంపిక చేసుకుంది. అమ్మడి అలంకరణ, మ్యాకప్, యాక్సరసీస్ ప్రతీది ఎంతో అందంగా తీర్చి దిద్దాయి. ఇక మృణాల్ ఠాకూర్ గోధుమ రంగు ప్యాంట్ పై బ్లాక్ కలర్ స్కిన్ టైట్ ధరించింది. అమ్మడి స్కిన్ టోన్ కటికి చీకటిలో మిరుమిట్లు గొలుపుతుంది.
డీప్ నెక్ డిటైలింగ్ - ఫుల్ స్లీవ్‌లను కలిగి ఉంది. బాటమ్ లో టక్ చేసి తన లుక్ కి పాలిష్ టచ్ ఇచ్చింది. ఇక అమ్మడి మ్యాకప్ ..హెయిర స్టైల్...పెదాలపై అందమైన నవ్వు మృణాల్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.