Begin typing your search above and press return to search.

అన‌న్య (X) మృణాల్.. ఒకే జిమ్‌లో ఈ కుస్తీలేంటి?

2024లో ఇన్‌స్టా ఫీడ్‌లు, టీవీ స్క్రీన్‌లపై ఎక్కువగా క‌నిపించింది అన‌న్య పాండే. సినిమాల‌తో ఆశించినంత‌గా విజ‌యాలు సాధించ‌లేదు.

By:  Tupaki Desk   |   15 Jan 2025 2:45 AM GMT
అన‌న్య (X) మృణాల్.. ఒకే జిమ్‌లో ఈ కుస్తీలేంటి?
X

2024లో ఇన్‌స్టా ఫీడ్‌లు, టీవీ స్క్రీన్‌లపై ఎక్కువగా క‌నిపించింది అన‌న్య పాండే. సినిమాల‌తో ఆశించినంత‌గా విజ‌యాలు సాధించ‌లేదు. సిఆర్‌టిఎల్ సిరీస్ న‌టిగా మంచి పేరు తెచ్చింది. కానీ సంతృప్తిక‌ర‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ లో మాత్రం న‌టించ‌లేక‌పోయింది. ఇప్పటికీ బాలీవుడ్ నెపో బేబి అంటూ చాలా మంది అన‌న్య‌ను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. కానీ అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి త‌న‌ను తాను నిరూపించుకునేందుకు అన‌న్య చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ముఖ్యంగా ఫిజిక‌ల్‌గా త‌న రూపాన్ని వంద‌శాతం కాపాడుకోవ‌డంలో అన‌న్య క‌మిట్‌మెంట్ ఆశ్చర్య‌ప‌రుస్తుంది.

ఈ భామ తాజాగా జిమ్‌- యోగాకు అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంది. జిమ్‌లో పైలేట్స్ శిక్ష‌ణ‌లో నిరంత‌రం క‌నిపిస్తోంది. తాజాగా మ‌రోసారి పైలేట్స్ శిక్ష‌ణ తీసుకుంటూ క‌నిపించింది. టోన్డ్ బాడీ కోసం అన‌న్య జిమ్ లో తీవ్రంగానే శ్ర‌మిస్తోంది. అయితే సరదాగా సాగిపోతున్న‌ క్లాస్ లో అన‌న్య‌తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా క‌నిపించింది. ఈ అమ్మాయిలు కొత్త సంవ‌త్స‌రాన్ని బలమైన నోట్ తో ప్రారంభించారు అంటూ దీనికి ట్యాగ్ ని కూడా జోడించారు. పైలేట్ గ‌ర్ల్స్ , ట్రైన్ స్మార్ట్.. వ‌ర్క్ హార్డ్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించారు.

2024లో అన‌న్య తన ప్రియుడు ఆదిత్యరాయ్ క‌పూర్ నుంచి విడిపోయింది. ఆ త‌ర్వాత న‌టిగా కెరీర్ పైనే పూర్తిగా శ్ర‌ద్ధ పెడుతోంది. మ‌రోవైపు మృణాల్ ఠాకూర్ వ‌రుస‌గా ద‌క్షిణాది చిత్రాల్లో న‌టిస్తూనే, ఉత్త‌రాదినా కొన్ని ముఖ్య‌మైన సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ఆ ఇద్ద‌రూ ఫిట్‌నెస్ కి అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన భామ‌లు ఒకే జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్.