Begin typing your search above and press return to search.

మృణాల్ ఠాకూర్ ఓపెనింగ్స్.. అంత చెల్లించాల్సిందే..

‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్.

By:  Tupaki Desk   |   23 Sep 2024 9:57 AM GMT
మృణాల్ ఠాకూర్ ఓపెనింగ్స్.. అంత చెల్లించాల్సిందే..
X

‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ఆమెకి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక ‘సీతారామం’ తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాతో తెలుగులో మృణాల్ మరో సక్సెస్ ని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీలో విజయ్ దేవరకొండకి జోడీగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల కోసం మృణాల్ ఠాకూర్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. మరో వైపు హిందీలో కూడా ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ కి వచ్చిన ఫేమ్ తో ఆమె కమర్షియల్ గా ఉపయోగించుకునే పనిలో ఉన్నారు.

చాలా చోట్ల జ్యువెలరీ, వస్త్ర దుకాణాలు ప్రారంభోత్సవానికి సెలబ్రెటీలని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. తెలుగులో వర్ధమాన తారల నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరూ షోరూమ్ ల ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ని కూడా ఇలాంటి షోరూమ్ ల ఓపెనింగ్ కోసం సంప్రదిస్తున్నారంట. అలాగే వస్త్ర దుకాణాల అడ్వార్టైజ్మెంట్స్ కోసం కూడా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

షోరూమ్ లు ఓపెనింగ్స్ కోసం మృణాల్ ఠాకూర్ 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందంట. పాయల్ రాజ్ పుత్ నుంచి తమన్నా, కాజల్, సమంత వరకు అందరూ షోరూమ్ లు ఓపెనింగ్స్ కి వెళ్తారు. పూజ హెగ్డే, రష్మిక మందనలకి షోరూమ్ ప్రారంభోత్సవాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. హీరోయిన్స్ ని ఇలా ఆహ్వానించడం ద్వారా పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో వస్తారు. తద్వారా షోరూమ్ కి పబ్లిసిటీ వస్తుంది.

వీటిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రారంభమయ్యే షోరూల కోసం సెలబ్రెటీలని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మృణాల్ ఠాకూర్ కూడా అదే తరహాలో మంచి ఆదాయం అందుకుంటోంది. ఇక అమ్మడి చేతిలో ప్రస్తుతం ఐదు హిందీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘పూజ మేరీ జాన్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే ‘మర్యాద రామన్న’కి రీమేక్ గా తెరకెక్కిన ‘సన్నాఫ్ సర్దార్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సీక్వెల్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.