Begin typing your search above and press return to search.

మృణాల్ ఠాకూర్ లోనూ మ‌స్తు షేడ్స్ ఉన్నాయే!

ఇదిగో ఇక్క‌డిలా ముఖంపై ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్ తో ఓ షో రిలీజ్ చేసింది. ఇందులో మృణాల్ ఒక‌ర‌కంగా కాదు..ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్ తో అద‌ర‌గొట్టింది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 10:37 AM GMT
మృణాల్ ఠాకూర్ లోనూ మ‌స్తు షేడ్స్ ఉన్నాయే!
X

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల యాక్టివిటీస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పేరుకు పేరు..డ‌బ్బుకు డ‌బ్బు తెచ్చిపెడుతోన్న మాధ్య‌మం ఇది. ఇక్కడ రాణించాలంటే? కేవ‌లం సినిమా హీరోయిన్ మాత్ర‌మే అవ్వాల్సిన ప‌నిలేదు. ల‌క్ష‌ల మంది ఫాలోవర్లు ఉంటే చాలు సెల‌బ్రిటీ హోదా ద‌క్కిన‌ట్లే.

ఇక నిజ‌మైన సెలబ్రిటీల సంగ‌తి వేరేలా ఉంటుంద‌నుకోండి. తాజాగా మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ త‌నలో కొత్త యాంగిల్ ని ఒక్కొక్క‌టిగా బ‌య‌టకు తీస్తుంది.

ఇదిగో ఇక్క‌డిలా ముఖంపై ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్ తో ఓ షో రిలీజ్ చేసింది. ఇందులో మృణాల్ ఒక‌ర‌కంగా కాదు..ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్ తో అద‌ర‌గొట్టింది. చెవుల‌కు హెడ్ పోన్స్ పెట్టుకుని అక్క‌డ సిచ్వేష‌న్ కి తగ్గ‌ట్టు అమ్మ‌డు ముఖంలో హ‌వ‌భావాలు మారుస్తుంది. సంతోషం, దుఖం, విచారం. సందిగ్ద‌త ఇలా స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులు త‌మ‌దైన శైలిలో పోస్టులు పెడుతున్నారు.

ఇక సీత‌మ్మ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటుంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ని మించి బాలీవుడ్ లో రెట్టించిన పారితోషికంతో అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే 'పూజా మేరీజాన్' షూటింగ్ పూర్తి చేసింది. అలాగే 'హైజ‌వానీ హై తో ఇష్క్ హోనా హై' అనే మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.

ఈ సినిమాల‌తో పాటు క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మిస్తున్న చిత్రంలోనే మృణాల్ అవ‌కాశం అందుకుంది. ఇందులో సిద్దాంత్ చ‌తుర్వేది హీరోగా న‌టిస్తున్నారు. ర‌వి ఉద్య‌వార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. 'ఆషీకీ -2' త‌ర‌హాలో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా హైలైట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి 'తుమ్ హీ హో 'అనే టైటిల్ ఖ‌రారు చేసారు.