Begin typing your search above and press return to search.

మృణాల్.. బాలీవుడ్ కు దూరంగా, టాలీవుడ్ కు దగ్గరగా..

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ టు సౌత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆమె.. తాను చేయబోయే సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటోంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 12:30 PM GMT
మృణాల్.. బాలీవుడ్ కు దూరంగా, టాలీవుడ్ కు దగ్గరగా..
X

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ టు సౌత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆమె.. తాను చేయబోయే సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటోంది. అన్ని విధాలుగా నచ్చితేనే ఓకే చెబుతున్న అమ్మడు.. అలా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ ఫేమ్ దక్కించుకుందనే చెప్పాలి.

మరాఠీ మూవీతో పదేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మృణాల్.. లవ్ సోనియా చిత్రంతో బీటౌన్ ఆడియన్స్ కు పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సీతారామంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఎలా అలరించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదేమో. తన అందం, అభినయంతో అందరినీ ఫిదా చేశారు.

టాలీవుడ్ సీతగా మారిపోయి.. తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత వివిధ హిందీ చిత్రాల్లో మెరిసిన బ్యూటీ.. నేచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్నలో యాక్ట్ చేసి మెప్పించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కానీ తెలుగులో హ్యాట్రిక్ మూవీ ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొడుతారనుకున్నా అది జరగలేదు.

చివరగా కల్కి 2898 ఏడీ మూవీలో క్యామియో రోల్ పోషించిన మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తమ్ హో తోహ్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో అడవి శేష్ డెకాయిట్ లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ స్పిరిట్ మూవీలో కూడా ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్లపాటు జరుగుతుందని సమాచారం. ఒకవేళ ఆ ఛాన్స్ దక్కితే ఆమె తెలుగులో మరింత క్రేజ్ ను సంపాదించుకోవడం పక్కా. అయితే ఇప్పుడు.. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ప్లాన్ లో మృణాల్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది భామలు.. తెలుగులో బిజీ అయ్యాక హైదరాబాద్ లో సొంత ఇల్లును కొనుగోలు చేసి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మృణాల్ కూడా హైదరాబాద్‌ లో స్థిర నివాసం కోసం వెతుకుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో.. మృణాల్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతారో లేదో వేచి చూడాలి. మృణాల్ హైదరాబాద్ లో ఉండడానికి ముఖ్య కారణం బాలీవుడ్ లో కంటే అమ్మడికి తెలుగులోనే మంచి క్రేజ్ దక్కుతోంది. పైగా హిందీలో ఆఫర్స్ వచ్చినా అవి చిన్న తరహాలో ఉంటున్నాయి. ఇక తెలుగులో హీరోయిన్స్ కొరత ఎప్పటికి ఉంటుంది.

పైగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇటు తెలుగులో అటు హిందీలో తెలిసిన హీరోయిన్స్ దొరకడం కష్టమే అవుతుంది. ఇక ఆ క్యాటగిరీ సినిమాలకు మృణాల్ పర్ఫెక్ట్ ఛాయిస్. అందుకే అమ్మడు హైదరాబాద్ లో ఉంటే నిర్మాతలకు కూడా అందుబాటులో ఉండవచ్చు. ప్రతీసారి ట్రావెలింగ్ ఖర్చుల భారం తగ్గుతుంది. ఏదేమైనా మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక తరువాత బెస్ట్ హీరోయిన్ గా అందుబాటులో ఉండాలని చూస్తోంది.