హాయ్ నాన్న జ్ఞాపకాల్లో మృణాల్..!
ఐతే మృణాల్ ఠాకూర్ మాత్రం హాయ్ నాన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంది. లేటెస్ట్ గా అమ్మడు హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రలో తన ఫోటోస్, వీడియోస్ ని షేర్ చేసింది.
By: Tupaki Desk | 12 March 2025 3:00 AM ISTఅంతకుముందు బాలీవుడ్ లో సినిమాలు చేసిన మృణాల్ ఠాకూర్ సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ సినిమాతో అమ్మడు ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాదించింది. సీతారామం వల్ల ఆమె రేంజ్ అమాంతం పెరిగింది. సీతారామం హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసింది మృణాల్ ఠాకూర్. శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా మృణాల్ కి సూపర్ హిట్ అందించింది. ఆ సినిమాలో యష్ణ పాత్రలో మృణాల్ అదరగొట్టేసింది.
నాని, మృణాల్ జోడీగా నటించిన హాయ్ నాన్న ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాదు ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. ముఖ్యంగా సినిమాలో హేషం మ్యూజిక్ ప్రత్యేకంగా నిలిచింది. హాయ్ నాన్న సినిమా 2023 డిసెంబర్ 7న రిలీజైంది. సినిమా రెండేళ్ల క్రితం రిలీజైనా మ్యూజికల్ గా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట హాయ్ నాన్న పాటలు వినిపిస్తాయి.
ఐతే మృణాల్ ఠాకూర్ మాత్రం హాయ్ నాన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంది. లేటెస్ట్ గా అమ్మడు హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రలో తన ఫోటోస్, వీడియోస్ ని షేర్ చేసింది. ముక్కు పుడకతో ఉన్న మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. హాయ్ నాన్న వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా మృణాల్ ఇంకా ఆ సినిమా జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. అంతేకాదు ఈ వీడియోస్ లో న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు.
ముక్కు పుడకలో తనని తాను చూసుకుని మురిసిపోతుంది మృణాల్ ఠాకూర్. అమ్మడు ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మొదటి ఫ్లాప్ అందుకోగా ప్రస్తుతం అమ్మడు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఐతే మృణాల్ ఠాకూర్ హిందీలో మాత్రం వరుస ప్రాజెక్ట్ లు సైన్ చేస్తుంది. తెలుగులో మృణాల్ చాలా సినిమాల్లో డిస్కషన్ లో ఉందని అంటున్నారు తప్ప అమ్మడికి ఒక్క ఛాన్స్ కూడా రావట్లేదు.
ఏ సినిమా అయినా మృణాల్ హీరోయిన్ గా నటిస్తే చాలు అందులో ఆమె రోల్ మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచినా కూడా నెక్స్ట్ సినిమాతో మరో హిట్ సినిమా కొట్టాలని చూస్తుంది అమ్మడు. ఐతే బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది మృణాల్. సినిమాలతోనే కాదు అమ్మడు ఫోటో షూట్స్ సోషల్ మీడియా యాక్టివిటీస్ తో కూడా ఫాలోవర్స్ కి దగ్గర అవుతుంది మృణాల్.