Begin typing your search above and press return to search.

మంచు గుహ‌ల్లో సీత‌మ్మ బెడ్ రూమ్ సీన్సా?

మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2024 6:08 AM GMT
మంచు గుహ‌ల్లో సీత‌మ్మ బెడ్ రూమ్ సీన్సా?
X

మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటుంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ని మించి బాలీవుడ్ లో రెట్టించిన పారితోషికంతో అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే `పూజా మేరీజాన్` షూటింగ్ పూర్తి చేసింది. అలాగే `హైజ‌వానీ హై తో ఇష్క్ హోనా హై` అనే మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.

ఈ సినిమాల‌తో పాటు క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మిస్తున్న చిత్రంలోనే మృణాల్ అవ‌కాశం అందుకుంది. ఇందులో సిద్దాంత్ చ‌తుర్వేది హీరోగా న‌టిస్తున్నారు. ర‌వి ఉద్య‌వార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. `ఆషీకీ -2` త‌ర‌హాలో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా హైలైట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా `తుమ్ హీ హో `అనే టైటిల్ ఖ‌రారు చేసారు.

ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇప్ప‌టికే సిద్దాంత్-మృణాల్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివే శాలు చిత్రీక‌రించారు. త్వ‌ర‌లో ఉత్త‌రాఖాండ్ లో మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఏకంగా బెడ్ రూమ్ స‌న్నివేశాలే హైలైట్ చేస్తున్నారుట‌. ఉత్త‌రాఖాండ్ మంచు గుహాల్లో హీరో-హీరోయిన్ మ‌ధ్య కొన్ని బెడ్ రూమ్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారుట‌.

మంచు గుహలో మంచుతో త‌యారు చేసిన మంచంపైనే ఈ స‌న్నివేశాలు ఎంతో అందంగా చిత్రీక‌ర‌ణ ప్లాన్ చేస్తున్నారుట‌. షూటింగ్ స‌మ‌యంలో మంచు వేగంగా క‌ర‌గ‌కుండా ప్ర‌త్యేకంగా కొన్ని ర‌కాల ర‌సాయ‌నాల్ని విదేశాల నుంచి దిగుమ‌తి చేసారుట‌. ఆ లొకేష‌న్ ని ఎంతో అందంగా అలంక‌రిం చాల‌న్న‌ది యూనిట్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇవి ఎంతో రియ‌లిస్టిక్ గానూ ఉంటాయ‌ని తెలుస్తోంది. ఎలాంటి స‌న్నివేశాల్లోనైనా మృణాల్ జీవిస్తుంది. ఆమె పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయిన్ గా మారిపోతుంది.