మృణాల్ కి లక్కీ ఛాన్సే.. కానీ..!
మృణాల్ ఠాకూర్ సౌత్ క్రేజ్ ని బాలీవుడ్ మేకర్స్ కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆమెకు వెరైటీ పాత్రలు ఇస్తున్నారు.
By: Tupaki Desk | 20 Jan 2025 12:30 PM GMTసీతారామం తో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. సీతారామం తర్వాత వెంటనే హాయ్ నాన్న పడటం అది కూడా హిట్ అవ్వడంతో అమ్మడికి తిరుగు లేదని అనుకున్నారు. ఐతే థర్డ్ సినిమాగా చేసిన ఫ్యామిలీ స్టార్ షాక్ ఇవ్వడంతో కాస్త డల్ అయ్యింది. ఐతే మృణాల్ ఇటు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. అక్కడ కూడా వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది.
మృణాల్ ఠాకూర్ సౌత్ క్రేజ్ ని బాలీవుడ్ మేకర్స్ కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆమెకు వెరైటీ పాత్రలు ఇస్తున్నారు. బాలీవుడ్ లో తనకు సరైన పాత్రలు రావట్లేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మృణాల్ ఇప్పుడు అక్కడ కూడా తనని గుర్తిస్తున్నందుకు సంతోషిస్తుంది. ఐతే లేటెస్ట్ ఆ అమ్మడి ఖాతాలో ఒక క్రేజీ సినిమా వచ్చి చేరింది. 2013 లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న రీమేక్ గా బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 చేస్తున్నారు.
సన్ ఆఫ్ సర్దార్ 2లో మృణాల్ ఠాకూర్ కి ఛాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల అమ్మడు సంతోషపడుతుంది. రాజమౌళికి ఈ సన్ ఆఫ్ సర్దార్ 2 కి ఏమాత్రం సంబంధం లేదు. ఐతే ఈ సీక్వెల్ మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు మేకర్స్. ముఖ్యంగా మృణాల్ కి ఇదొక మంచి అవకాశమని అంటున్నారు. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో తన అభినయంతో మెప్పించిన మృణాల్ కి బాలీవుడ్ లో కూడా అలాంటి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.
సన్ ఆఫ్ సర్దార్ 2 లో ఆమెది కూడా మంచి పాత్ర అని.. సినిమాలో ఆమె సీన్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2 తర్వాత మృణాల్ ఠాకూర్ కెరీర్ మళ్లీ జోష్ అందుకుంటుందని చెబుతున్నారు. మృణాల్ కూడా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా తన దాకా వచ్చిన ప్రతి సినిమా చేస్తూ అలరిస్తుంది. మరి సన్ ఆఫ్ సర్దార్ 2 మృణాల్ కి ఎలాంటి క్రేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి. రాజమౌళి రిఫరెన్స్ ఉన్న సినిమా సీక్వెల్ అనేయగానే మృణాల్ మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని టాక్.