Begin typing your search above and press return to search.

గ్లామర్ షోలో నిన్ను కొట్టేవారే లేరు 'మృణాల్'

2019లో వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 2:56 PM GMT
గ్లామర్ షోలో నిన్ను కొట్టేవారే లేరు మృణాల్
X

మృణాల్ ఠాగూర్.. తన టాలెంట్, అందం, అద్భుతమైన అభినయంతో సినీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు అందుకున్న నటి. టెలివిజన్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె, హిందీ టీవీ సీరియల్స్‌లో మెరిసి, సినిమాల వైపు అడుగులేశారు. ఆమె నటనతో మెప్పించి, అతి తక్కుక కాలంలోనే బాలీవుడ్‌లో వరుస ఛాన్స్ లు అందుకుంది. 2019లో వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


ఇక బాలీవుడ్‌లో అనంతరం అమ్మడు పలు వెబ్ సీరీస్ లలో కూడా మంచి క్రేజ్ అందుకుంది. అనంతరం మెల్లగా టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు. తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘సీతారామం’ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె ‘సీత’ పాత్రలో అదరగొట్టారు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.


ఆ సినిమా తరువాత బాలీవుడ్‌లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ‘సీతారామం’ తర్వాత మృణాల్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారింది. నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీలో కూడా ఆమె ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ మూవీ మరో హిట్ కావడంతో మృణాల్‌కు టాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగింది. ఆమె నటన, ఎమోషనల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో ఆమె తెల్లటి కలర్‌లో రంగుల డిజైన్ ఉన్న లాంగ్ గౌన్‌లో చాలా అందంగా మెరిసిపోతున్నారు. ఆమె సింపుల్ స్టైల్, క్యూట్ లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. బ్యాక్‌లెస్ డ్రెస్‌లో ఆమె క్యూట్ అండ్ క్లాసీగా కనిపించారు. మేకప్ కూడా సింపుల్‌గా, నేచురల్ గ్లోతో ఉన్నది. ఫ్యాన్స్ ఈ స్టిల్స్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


ప్రస్తుతం మృణాల్ టాలీవుడ్ బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సన్ ఆఫ్ సర్దార్ సినిమాతో పాటు మరో మూడు హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక అడివి శేష్ తో డెకయిట్ అనే సినిమా చేస్తోంది. తెలుగులో ఆమె ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారని టాక్. తన టాలెంట్, అందం, హార్డ్‌వర్క్‌తో మృణాల్ తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మరి భవిష్యత్తులో అమ్మడి నుంచి రాబోయే సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.