Begin typing your search above and press return to search.

మృణాల్.. తప్పుకోవడమే బెటర్

తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ తో దూసుకుపోతున్న అందాల భామ మృణాల్ ఠాకూర్.

By:  Tupaki Desk   |   15 Oct 2024 7:33 AM GMT
మృణాల్.. తప్పుకోవడమే బెటర్
X

తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ తో దూసుకుపోతున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాతో తెలుగునాట మృణాల్ ఠాకూర్ కి విశేషమైన గుర్తింపు లభించింది. దాని తర్వాత ‘హాయ్ నాన్న’ తో మరో హిట్ అందుకుంది. చివరిగా ఈ ఏడాది విజయ్ దేవరకొండకి జోడీగా ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీతో మృణాల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ హిందీలో ‘పూజా మేరీ జాన్’ అనే సినిమా చేసింది. హ్యూమా ఖురేషి ఈ సినిమాలో మరో లీడ్ రోల్ లో చేసింది. నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు 2025కి మూవీని వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం విక్కీ కౌశల్, రష్మిక జోడీగా నటించిన ‘చావా’ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది.

భారీ బడ్జెట్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ చిత్రం రాబోతోంది. మడ్ డోక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ‘పూజా మేరీ జాన్’ సినిమా కూడా అదే బ్యానర్ లో తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. అయితే ‘పూజా మేరీ జాన్ మూవీ’ మీద మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే ‘చావా’ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే పుష్ప 2 కూడా అదే టైమ్ లో వస్తోంది. అసలే హిందీలో ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. థియేటర్స్ కూడా గట్టిగానే రావచ్చు.

దీంతో ‘పూజా మేరీ జాన్’ మూవీతో ‘చావా’ కి ఇబ్బంది అవుతుందని నిర్మాత భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలకి ఇబ్బంది కాకుండా 2025కి మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని వాయిదా వేశారంట. ఎలాంటి పోటీ లేకుండా సింగిల్ గా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ‘చావా’ మూవీలో విక్కీ కౌశల్ కి జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

ఇదిలా ఉంటే దీపావళికి బాలీవుడ్ నుంచి ‘సింగం అగైన్’ మూవీతో పాటు ‘భూల్ భులయ్యా 3’ రిలీజ్ అవుతున్నాయి. వీటి తర్వాత డిసెంబర్ 6న ‘చావా’ థియేటర్స్ లోకి వస్తోంది. క్రిస్మస్ కానుకగా వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ చిత్రంలో రిలీజ్ కాబోతోంది. ఇలా కాస్తా హైప్ ఉన్న సినిమాలు అన్ని కూడా రెండు నెలల గ్యాప్ లో బ్యాక్ టూ బ్యాక్ బాలీవుడ్ లో విడుదల కాబోతుండటం విశేషం.