అందుకే సీతమ్మకి అంత పారితోషికం ఇచ్చి తెచ్చారా?
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ఈ సినిమాకు అమ్మడు అందుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
By: Tupaki Desk | 22 Dec 2024 10:30 AM GMTఅడవి శేషు కథానాయకుడిగా నటిస్తోన్న `డెకాయిట్` చిత్రానికి ముందుగా హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. శ్రుతి హాసన్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే అనూహ్యంగా శ్రుతి ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయింది. అందుకుగల కారణాలు ఏంటి అన్నది తెలియదు. ఆమె పాత్రతో పాటు, సహనటుడి విషయంలో అమ్మడు అసంతృప్తిగా ఉందని ...ఆ కారణంగానే ఎగ్జిట్ అయిందే పుకార్ తెరపైకి వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదుగానీ మీడియాలో జరిగిన ప్రచారమది.
అటుపై శ్రుతిహాసన్ స్థానంలో మృణాల్ ఠాకూర్ని ఎంపిక చేసారు. ఆమెతో పాటు టీమ్ సెట్స్ కు వెళ్లింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ఈ సినిమాకు అమ్మడు అందుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకు 3.5 కోట్లకు పైగా చార్జ్ చేస్తోందిట. ఈ పారితోషికం శ్రుతి హాసన్ కంటే అధికమని అంటున్నారు. శ్రుతి హాసన్ కి రెండున్నర కోట్లు మాత్రమే ఆఫర్ చేయగా అందుకు ఒప్పుకునే అంగీకరించింది.
ఆయితే ఆమె తప్పుకున్న తర్వాత మృణాల్ కి మూడున్నర కోట్లు ఇచ్చి తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంత పారితోషికం మృణాల్ డిమాండ్ చేయనప్పటికీ పాన్ ఇండియాలో ఆమె క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఆఫర్ చేసారుట. ఇక్కడ మరో కారణం కూడా వినిపిస్తుంది. శ్రుతి హాసన్ తప్పుకోవడంతో? ఆమె మార్కెట్ ని బీట్ చేయాలి? అన్న కోణంలోనూ ముంబై బ్యూటీకి ఈ రేంజ్ లో ఆఫర్ చేసారనే రీజన్ కూడా వినిపిస్తుంది. మరిఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.
సాధారణంగా రన్నింగ్ ప్రాజెక్ట్ నుంచి ముందుగా సెలక్ట్ అయిన హీరోయిన్ ఎగ్జిట్ అయితే రకరకాల కారణాలు తెరపైకి వస్తుంటాయి. మేజర్ గా యూనిట్ తో విబేధాల కారణంగా హీరోయిన్లు తప్పుకుంటారనే రీజన్ ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా శ్రుతి హాసన్ ఎగ్జిట్ వెనుక కూడా అదే కారణంగా వైరల్ అవుతుంది. చెన్నై స్టోరీ కి కూడా శ్రుతి హాసన్ సైన్ చేసి ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. మరి వరుసగా ఇలా ప్రాజెక్ట్ లు చేజార్చుకోవడం వెనుక అసలు కారణం ఏంటన్నది ఆమె చెప్పాలి.